హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. చిన్నారులకు తీవ్ర గాయాలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 03:53 PM
వనస్థలిపురం ఆటోనగర్‌లోని హైకోర్టు కాలనీ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వంశీ, వాణి దంపతుల రెండేళ్ల మాన్విశ్, ఏడాదిన్నర వయసున్న యుగ్విశ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆటోనగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్ హైకోర్టు కాలనీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హయత్‌నగర్ రంగనాయకుల గుట్టకు చెందిన వంశీ, వాణి దంపతులు ఇద్దరు పిల్లలతో బైకుపై ఎల్బీనగర్ వైపు ప్రయాణిస్తుండగా ఓ కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి ఇద్దరు చిన్నారులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు.
ఈ ఘటనలో చిన్నారులు మాన్విశ్ (2), యుగ్విశ్ (ఏడాదిన్నర)కు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారుల తలకు గాయాలు, చెవుల నుంచి రక్తస్రావం అయినట్లు తెలుస్తోంది. బీటెక్ విద్యార్థి నితిన్ కారు నడుపుతున్నట్లు సమాచారం. కారులో నితిన్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందగానే ఘటనాస్థలికి వనస్థలిపురం పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాదంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం: డీజీపీ ఆనంద్
దసరా పండుగ రద్దీ.. టికెట్‌పై ఆర్టీసీ 40శాతం అదనపు ఛార్జీలు
అహ్మదాబాద్ - హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News