మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి హత్య.. నిందితుడు అరెస్ట్
ABN , Publish Date - Sep 29 , 2026 | 10:34 AM
హైదరాబాద్ మాదాపూర్‌లో గల ఓయో హోటల్‌లో హత్యకు గురైన యువతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస రవితేజను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మాదాపూర్‌లో గల ఓయో హోటల్‌లో హత్యకు గురైన యువతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస రవితేజను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకోమని నిఖిత వేధిస్తుండటంతోనే చంపానని నిందితుడు ఒప్పుకున్నాడు. ఈనెల 21వ తేదీన మాదాపూర్‌లోని సిద్ధికి నగర్‌లో ఓయో రూమ్‌లో యువతి, యువకుడు దిగారు. అదే రోజు రాత్రి ఆమెను శ్రీనివాస్ రవితేజ చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లిందని హోటల్ సిబ్బందికి చెప్పి సమీపంలోని హాస్పిటల్‌కు నిందితుడు తరలించాడు. ఆస్పత్రిలో యువతి చనిపోయిందని చెప్పడంతో అక్కడి నుంచి అతడు పరారయ్యాడు. అనంతరం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని స్వగ్రామానికి నిందితుడు వెళ్లాడు. మరుసటి రోజు ఆత్మహత్యాయత్నానికి యువకుడు పాల్పడ్డాడు. అతడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో శ్రీనివాస రవితేజను రిమాండ్‌కు పోలీసులు తరలించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దిమ్మ తిరిగే రిజల్ట్స్ వస్తాయి: దానం నాగేందర్
భాగ్యనగరంలో మైకుల మోతపై నటుడు అల్లు శిరీశ్ ఫిర్యాదు
ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News