ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనాలు.. పోలీసులతో కలిసి సజ్జనార్ డాన్స్..
ABN , Publish Date - Sep 26 , 2026 | 03:07 PM
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన మహోత్సవం విజయవంతంగా పూర్తయింది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ వద్ద పోలీసులు సంబరాలు చేసుకున్నారు. పోలీసులతో కలిసి హైదరాబాద్ సీపీ సజ్జనార్ కూడా డాన్స్ చేయడం విశేషం.
హైదరాబాద్, సెప్టెంబర్ 26: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన మహోత్సవం విజయవంతంగా పూర్తయింది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ వద్ద పోలీసులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో కలిసి హైదరాబాద్ సీపీ సజ్జనార్ డీజే పాటలకు డాన్స్ చేయడం విశేషం. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
నగరంలో నిమజ్జనం సందర్భంగా ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ ఉద్యోగి వరకూ పోలీసులందరూ రేయింబవళ్లు బందోబస్తు చేపట్టారు. వారి నిబద్దతతో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఆనందంలో పోలీసులు సెక్రటేరియట్ వద్ద డీజే పాటలకు డాన్స్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ కూడా సిబ్బందితో కలిసి డాన్స్ చేశారు. ఆయనతో పాటు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, అడిషనల్ జాయింట్ సీపీ తప్సిర్ ఇక్బాల్, హైదరాబాద్‌కు చెందిన వివిధ జోన్ డీసీపీలు కూడా డాన్స్ వేశారు. ఉన్నతాధికారులు తమతో కలిసి డాన్స్ చేయడంతో పోలీసు సిబ్బంది మరింత ఉత్సాహంతో సంబరాలు జరుపుకొన్నారు. ప్రస్తుతం పోలీసుల డాన్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు
రూ.39 లక్షలు పలికిన బాలాపూర్ లంబోదరుడి లడ్డూ
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపయ్య
Read Latest Telangana News And AP News And National News
And Telugu News