బాలిక నిఖా కేసులో సంచలనం.. పోలీసులపై లంచం ఆరోపణలు
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:22 PM
హైదరాబాద్‌లో ఓ బాలిక వివాహం కేసులో పోలీసుల తీరు సంచలనంగా మారింది. 17ఏళ్ల బాలికను పెళ్లి చేసుకునేందుకు సౌదీ నుంచి అరబ్‌షేక్ వచ్చాడు. ఈ క్రమంలోనే పోలీసులకు.. అంగన్వాడీ టీచర్ సమాచారం ఇచ్చారు. పెళ్లి జరగకుండా మైనర్‌ను పోలీసులు కాపాడారు.
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఓ బాలిక వివాహం కేసులో పోలీసుల తీరు సంచలనంగా మారింది. 17ఏళ్ల బాలికను పెళ్లి చేసుకునేందుకు సౌదీ నుంచి అరబ్‌షేక్ వచ్చాడు. ఈ క్రమంలోనే పోలీసులకు.. అంగన్వాడీ టీచర్ సమాచారం ఇచ్చారు. పెళ్లి జరగకుండా మైనర్‌ను పోలీసులు కాపాడారు. అక్టోబరు 2వ తేదీన సౌదీ నుంచి నగరానికి 42 ఏళ్ల అరబ్‌షేక్ వచ్చాడు. 20 రోజుల తర్వాత ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు రూ.50 లక్షల లంచం ఇచ్చి సౌదీకి అరబ్‌షేక్ పారిపోయినట్లుగా సమాచారం.
బాల్యవివాహం కావడం, పైగా సౌదీ నుంచి వచ్చి నిఖా పేరుతో బాలికను అక్రమ రవాణా చేస్తున్నట్లుగా కేసు నమోదయ్యే అవకాశం ఉండటంతో నిందితుడు అలర్ట్ అయ్యాడు. అతడిని వదిలిపెట్టడానికి పోలీసులు రూ.కోటి వరకు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులకు కొంత డబ్బు లంచంగా ఇచ్చి నిందితుడు తిరిగి దుబాయ్ పారిపోయినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.అరకోటి వరకూ డబ్బులు చేతులు మారినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ ఘటన జరిగిన 20 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీస్ ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. బాల్య వివాహాన్ని అడ్డుకొని, బాలికను రక్షించి సఖీ సెంటర్‌కు పోలీసులు తరలించారు. ఈ విషయాన్ని బహిర్గతం చేయకుండా, ఎలాంటి మీడియా ప్రకటనా విడుదల చేయకుండా రహస్యంగా ఉంచడం వెనుక పోలీసులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణిని మరింత బలోపేతం చేస్తాం: భట్టి విక్రమార్క
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విదేశాల్లోనూ ఆదరణ పెరుగుతోంది: ఎంపీ రఘునందన్
ఎల్‌నినో ప్రభావంతో ఎండలు 50 డిగ్రీలకు చేరే అవకాశం: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And AP News And National News
And Telugu News