నేడు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు
ABN , Publish Date - Oct 14 , 2026 | 07:21 AM
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న నాలుగో టీ-20 నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లను నడిపించనున్నారు.
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న నాలుగో టీ-20 నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లను నడిపించనున్నారు. ఈ మేరకు రోడ్లపై ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు నాగోల్- రాయదుర్గం కారిడార్లోని ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లను రాత్రి వరకు తెరిచి ఉంచనున్నారు. చివరి రైలు ఈ రెండు స్టేషన్ల నుంచి రాత్రి 12 గంటలకు బయలుదేరుతోందని ఎల్అండ్టీ అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హైదరాబాద్లో కొత్తగా 70వేల మంది ఓటర్లు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News