Share News

దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:43 AM

బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్‌ రీజినల్‌ మేనేజర్‌ శ్రీదేవి తెలిపారు.

దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు
Dussehra Special Buses

  • రంగారెడ్డి రీజియన్‌ రీజినల్‌ మేనేజర్‌ శ్రీదేవి

హైదరాబాద్‌ సిటీ: బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్‌ రీజినల్‌ మేనేజర్‌ శ్రీదేవి తెలిపారు. దసరా ప్రత్యేక ఆపరేషన్లపై ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రత, పారిశుధ్యంపై మంగళవారం మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌లో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. అక్టోబరు 9 నుంచి 20 వరకు 7 వేల ప్రత్యేక బస్సులు నడిపేలా ప్లాన్‌ చేసినట్లు పేర్కొన్నారు.


గ్రేటర్‌ నుంచి ఏపీ, తెలంగాణ జిల్లాలకు అక్టోబరు 16న 1,354, 17న 1,211 బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. ప్రధాన ట్రాఫిక్‌ కూడళ్లు, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, బస్‌స్టేషన్ల వద్ద పోలీస్‌ సిబ్బందిని, షీటీమ్స్‌ను అదనంగా నియమించాలని పోలీస్‌శాఖను కోరారు. ఎంజీబీఎస్‌ పరిసరాల్లో దోమలనివారణకు ఫాగింగ్‌ యంత్రాలతో చర్యలు చేపట్టాలని, వీధి కుక్కల సమస్యను నియంత్రించాలని సూచించారు.


city1.2.jpgప్రయాణికులను తరలించే వైట్‌ నంబర్‌ ప్లేట్‌ కార్లను అరికటేకట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డీటీసీ సదానందంను కోరారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీ వేణుగోపాల్‌రెడ్డి, డీటీసీ సదానందం, సికింద్రాబాద్‌ జోన్‌ ఏసీపీ శ్రీనివాస్‌, చార్మినార్‌ ఏసీపీ లక్ష్మణ్‌, ట్రాఫిక్‌ సీఐలు పాల్గొన్నారు.


ఏ రోజు ఎన్ని బస్సులు

శుక్రవారం-1354

శనివారం-1211

ఆదివారం-710

సోమవారం-686

మంగళవారం-337


ఈ వార్తలు కూడా చదవండి:

17న అక్కడక్కడ భారీ వర్షాలు

హైదరాబాద్‌లో కొత్తగా 70వేల మంది ఓటర్లు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 06:45 AM