ఏసీబీ కస్టడీకి నిమ్స్ లక్ష్మీ భాస్కర్
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:08 AM
నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ను ఏసీబీ అధికారులు విచారణ నిమిత్తం మంగళవారం కస్టడీకి తీసుకున్నారు.
బినామీల వ్యవహారంపై ప్రశ్నించే అవకాశం
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ను ఏసీబీ అధికారులు విచారణ నిమిత్తం మంగళవారం కస్టడీకి తీసుకున్నారు. లక్ష్మీభాస్కర్ను మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో చంచల్గూడ జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. లక్ష్మీ భాస్కర్ను అక్రమార్జన కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం, ఆపై ఆయనను సస్పెండ్ చేసిన సంగతి విదితమే. లక్ష్మీ భాస్కర్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత ఏసీబీలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (సీఐయూ)సెల్ మరో సారి రంగంలో దిగి ఆయన బినామీల ఇళ్లల్లో సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులు, నగదు గుర్తించింది.
లక్ష్మీ భాస్కర్ తన సంపాదనలో చాలావరకు బినామీల పేరిట ఉంచారని, వడ్డీ వ్యాపారం చేశారని, కొన్ని కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు వచ్చిన క్రమంలో బినామీ ఆస్తుల కోణంలో ఏసీబీ అధికారులు అతడ్ని విచారించే అవకాశాలు కన్పిస్తున్నాయి. లక్ష్మీ భాస్కర్ ఆస్తులు, అతనికి బినామీలుగా ఉన్న మరికొందరు నిమ్స్ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ మరింత అదనపు సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. మహేశ్వరం, మొయినాబాద్, కందుకూరు ప్రాంతాల్లో లక్ష్మీ భాస్కర్ బినామీల పేరిట స్థలాలు కొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సింగరేణికి రూ.59 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి
భద్రతా ఫీచర్ల పేపర్తో కొత్త ‘మీ-సేవ’ సర్టిఫికెట్
హైదరాబాద్లో కొత్తగా 70వేల మంది ఓటర్లు!
Read Latest AP News And Telangana News And International