మెట్రో డీలక్స్ బస్ చార్జీల్లో రాయితీ
ABN , Publish Date - Mar 24 , 2026 | 08:20 AM
గ్రేటర్‌లో మెట్రో డీలక్స్ బస్సుల సంఖ్య పెంచే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దానిలో భాగంగా చార్జీల్లో 15-20 శాతం రాయితీ కల్పిస్తోంది.
జూన్ నాటికి మరో 150 బస్సులు
గ్రేటర్ జోన్‌లో ప్రస్తుతం 275 ..
మెట్రోడీలక్స్ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ చార్జీలు
హైదరాబాద్ సిటీ: గ్రేటర్‌లో మెట్రో డీలక్స్ బస్సుల సంఖ్య పెంచే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దానిలో భాగంగా చార్జీల్లో 15-20 శాతం రాయితీ కల్పిస్తోంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ చార్జీలనే వీటిలోనూ తీసుకుంటోంది. అలాగే జూన్ నాటికి మరో 150 మెట్రో డీలక్స్ బస్సులను రోడ్లపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలతో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ సమయంలో ఫుట్‌బోర్డు ప్రయాణాలు చేసేందుకు కూడా బస్సుల్లో స్థలం ఉండటం లేదు.
డీలక్స్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలు లేకపోవడంతో ఆక్యుపెన్సీ తక్కువగా నమోదవుతోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌జోన్‌లో నడుపుతున్న 275 మెట్రో డీలక్స్ బస్సుల్లో మెట్రో చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెంచే వంద శాతం వచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించింది. మార్చి, ఏప్రిల్, మే మూడు నెలల పాటు రాయితీ చార్జీలతో వచ్చే ఫలితం ఆధారంగా తదుపరి చర్యలు చేపడుతామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లో కొత్త బస్ రూట్‌మ్యాప్‌లు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సేవలు విస్తరిస్తూ టికెట్ల ఆదాయం పెంచే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది.

డీలక్స్ బస్సుల్లో చార్జీలు ఇలా..
కిలోమీటర్లు.. పాతచార్జీ.. కొత్త చార్జీ
2 - 15 - 15
4 - 30 - 25
6 - 40 - 30
8/10/12/14 - 45 - 40
16/18 - 50 - 45
20 - 55 - 45
ఈ వార్తలు కూడా చదవండి:
భద్రాద్రి వివాదంపై నివేదిక లేకుండా ఏంచేస్తాం?
Read Latest Telangana News and National News