Share News

స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. యువతి మృతి

ABN , Publish Date - Jun 21 , 2026 | 08:54 AM

హయత్‌నగర్ పరిధిలోని పుల్లారెడ్డి స్వీట్స్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. యువతి మృతి
Hyderabad Road Accident

హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): హయత్‌నగర్ పరిధిలోని పుల్లారెడ్డి స్వీట్స్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతురాలు ప్రత్యూశ (20), బ్యూటీషియన్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం తీవ్ర గాయాలతో ఆమెను సమీప ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న (శనివారం) అర్ధరాత్రి మృతిచెందింది.


ప్రత్యూశ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం కాగా, ఆమె కుటుంబం పెద్ద అంబర్‌పేట్‌లో నివసిస్తోంది. ఈ ఘటన తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ప్రమాదం తర్వాత స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అమరావతిని చాలా బాగా అభివృద్ధి చేశారు.. సీఎం చంద్రబాబుపై బాబా రామ్‌దేవ్ ప్రశంసలు

నేను హోం మంత్రిని కాదు... అది క్రిమినల్స్ అదృష్టం: పవన్ కల్యాణ్

25 కోట్ల మందిని పేదరికం నుంచి మోదీ సర్కార్ బయటకు తీసుకొచ్చింది: మంత్రి సత్యకుమార్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 21 , 2026 | 08:58 AM