Share News

25 కోట్ల మందిని పేదరికం నుంచి మోదీ సర్కార్ బయటకు తీసుకొచ్చింది: మంత్రి సత్యకుమార్

ABN , Publish Date - Jun 20 , 2026 | 09:13 PM

ఆర్థిక, అంత్యోదయ విధానంతో ముందుకెళ్తున్నామని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. పేదరికాన్నీ నిర్ములించడానికి మోదీ సర్కార్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

25 కోట్ల మందిని పేదరికం నుంచి మోదీ సర్కార్ బయటకు తీసుకొచ్చింది: మంత్రి సత్యకుమార్
AP Minister Satya Kumar Yadav

విజయవాడ, జూన్ 20, (ఆంధ్రజ్యోతి): ఆర్థిక, అంత్యోదయ విధానంతో ముందుకెళ్తున్నామని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ (AP Minister Satya Kumar Yadav) వ్యాఖ్యానించారు. పేదరికాన్నీ నిర్ములించడానికి మోదీ సర్కార్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు(శనివారం) డాక్టర్ దిలీప్ కిలారు రాసిన ‘భారత్ రైజింగ్ ఇన్ ది మోదీ ఎరా’ పుస్తకాన్ని మంత్రి సత్యకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 110 కేంద్ర పథకాలతో ఉండే ఒక మంచి బుక్‌ని దిలీప్ రచించారని ప్రశంసించారు. జీవన ప్రమాణాలు పెంపొందిచాలని, కేంద్ర పథకాలపై పేదలకు అవగాహన కలిపించాలనే మంచి ఉద్దేశంతో దిలీప్ ఈ పుస్తకాన్ని రచించారని కొనియాడారు. గత 12సంవత్సరాల్లో వచ్చిన క్వాలిటీ, క్వాంటిటేటివ్ అంశాలను ప్రస్థావిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లేలా మంచి ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. ‘భారత్ రైజింగ్ ఇన్ ది మోదీ ఎరా’ అనే మంచి పుస్తకాన్నిరచించటం గొప్ప దృఢ సంకల్పమని ఉద్ఘాటించారు.


ఆర్థిక వ్యవస్థను నిలబెట్టారు..

కిలారు దిలీప్ చాలా సమర్థమంతంగా ఈ బుక్‌ని ఆవిష్కరించారని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. మోదీ సవాళ్లని అవకాశాలుగా ఏవిధంగా మలుచుకున్నారనే అంశాలను ఈ పుస్తకంలో వివరించారని తెలిపారు. సామాజిక, రాజకీయ పరిస్థితులపై ఓ సామాన్య కార్యకర్త పుస్తకం రచిస్తే ఎలా ఉంటుందో అది భారత్ రైజింగ్ పుస్తకంలా ఉంటుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థను నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక ఏవిధంగా నిలబెట్టారో అందరూ చూస్తున్నారని వివరించారు. పేదల జీవిత అనుభవాలతోనే మోదీ లక్ష్యాలను సాధించారని ప్రశంసించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానానికి వెళ్లేలా మోదీ జైత్రయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. గత 12 సంవత్సరాల్లో మోదీ తీసుకున్న అనేక నిర్ణయాలతో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారని ప్రస్తావించారు. ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. అక్కాచెల్లెళ్ల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారని వివరించారు.


అవినీతి రహిత పాలనని మోదీ సర్కార్ అందించింది..

హెల్త్ కార్డ్స్ ద్వారా అనేక వ్యాధులకు వైద్యం అందించారని మంత్రి సత్యకుమార్ చెప్పారు. జల్ జీవన్ మిషన్ కింద సురక్షత నీటిని అందించారని వెల్లడించారు. ఇవన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో లేని పథకాలని వివరించారు. ఒక చిన్న నిర్ణయం దేశ జీడీపీలో ఎంత వృద్ధి చెందుతుందో ప్రధాని మోదీ ఈ 12సంవత్సరాల పాలనలో చూపించారని కొనియాడారు. రైతంగాన్ని ఆదుకోవడంలో కేంద్రప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. వర్క్ ఫోర్స్ లేకపొవడంతో ప్రతి ఒక్కరిని ఒక పారిశ్రామికవేత్తగా ఉండేలా మోదీ ప్రోత్సహించారని ప్రశంసించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి పైసలు జమ అయ్యేలా చేశారని చెప్పుకొచ్చారు. డిజిటల్ పేమెంట్స్‌ని విప్లవాత్మకంగా మార్చారని తెలిపారు. మోదీ హయాంలోని ఈ 12సంవత్సరాల్లో అవినీతి నిర్ములన జరిగిందని ప్రస్తావించారు. ఎవరూ కూడా విమర్శలు, ఆరోపణలు చేయలేని విధంగా అవినీతి రహిత పాలనని మోదీ సర్కార్ అందించిందని ప్రశంసించారు. మోదీపై అవినీతి విమర్శలు చేసే ధైర్యం ఏ నాయకుడు చేయలేరని.. అలాగే ఒక్క బీజేపీ సీఎంపై కూడా అవినీతి ఆరోపణలు చేయలేరని తెలిపారు. 2047 నాటికి ఆర్ధికాభివృద్ధిలో భారత్ నెంబర్ వన్‌గా ఉంటుందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఈగల్ వ్యవస్థతో డ్రగ్స్‌కు చెక్ పెట్టాం: హోం మంత్రి అనిత

మహిళలను కించపరిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు.. వైసీపీకి మంత్రి ఆనం వార్నింగ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 20 , 2026 | 09:32 PM