Share News

హైదరాబాద్‌లో యువకుడి తలపై విరిగిపడ్డ విద్యుత్ స్తంభం

ABN , Publish Date - Nov 18 , 2026 | 07:51 AM

హైదరాబాద్ లంగర్ హౌస్‌లో విద్యుత్ స్తంభం తలపై పడటంతో 29 ఏళ్ల యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహదీ కాలనీలో ఈ ఘటన జరిగింది. రెడీమిక్స్ వాహనం ఢీకొట్టడంతో సిమెంట్ కరెంట్ స్తంభం విరిగిపడింది.

హైదరాబాద్‌లో యువకుడి తలపై విరిగిపడ్డ విద్యుత్ స్తంభం
Hyderabad Accident

హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): నగరంలోని లంగర్ హౌస్‌లో విద్యుత్ స్తంభం తలపై పడటంతో 29 ఏళ్ల యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహదీ కాలనీలో ఈ ఘటన జరిగింది. రెడీమిక్స్ వాహనం ఢీకొట్టడంతో సిమెంట్ కరెంట్ స్తంభం విరిగిపడింది. గుడ్లు, పాలు తీసుకుని ఇంటికి వెళ్తుండగా స్థానిక యువకుడు జబ్బార్ తలపై విద్యుత్ స్తంభం పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జబ్బార్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


యువకుడి ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిపారు. ఘటనాస్థలానికి కుల్సుంపురా ఏసీపీ వి. తిరుపతి, లంగర్ హౌస్ పోలీసులు చేరుకుని ఈ ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. భవన యజమాని, బిల్డర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని లంగర్ హౌస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సమ్మక్క సాగర్‌ బ్యారేజీ.. ఎన్‌ఓసీ జారీకి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం..!

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: మంత్రి శ్రీధర్‌బాబు

సుప్రీంకోర్టుకు చేరిన 'భారత్ సమ్మిట్' వివాదం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 08:01 AM