Share News

నార్సింగిలో కారు బీభత్సం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి

ABN , Publish Date - Aug 10 , 2026 | 07:48 AM

హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షాకోట్‌ ఎస్‌ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర XUV కారు బీభత్సం సృష్టించింది. ఈ కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతిచెందారు.

నార్సింగిలో  కారు బీభత్సం..  రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి
Narsingi Road Accident

హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షాకోట్‌ ఎస్‌ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర XUV కారు బీభత్సం సృష్టించింది. ఈ కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతిచెందారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని ఈ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం రాపిడో బైక్‌పై వెళ్తున్న ఇద్దరినీ ఈ కారు ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ఒకరికి కాలు విరిగింది.


గాయపడిన వారిని ప్రైవేట్ ఆస్పత్రికి నార్సింగి పోలీసులు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత కారును అక్కడే వదిలి నలుగురు యువకులు పరారయ్యారు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. ఢీకొట్టిన కారు శంషాబాద్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ కారు అతివేగంగా దూసుకురావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


వార్తలు కూడా చదవండి...

కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క

తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్‌

సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 10 , 2026 | 11:58 AM