Share News

హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో 9 మందికి జీవిత ఖైదు

ABN , Publish Date - Sep 18 , 2026 | 11:13 AM

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మానవ అక్రమ రవాణా కేసులో హైదరాబాద్‌ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో తొమ్మిది మందికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో 9 మందికి జీవిత ఖైదు
Hyderabad Human Trafficking Case

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మానవ అక్రమ రవాణా కేసులో హైదరాబాద్‌ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో తొమ్మిది మందికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. తొమ్మిది మంది నిందితుల్లో ఎనిమిది మంది బంగ్లాదేశ్‌ జాతీయులు ఉన్నారు. 2019లో బంగ్లాదేశ్‌ మహిళలను అక్రమంగా భారత్‌కు తరలించడంపై ఈ కేసు నమోదైంది. ఉద్యోగాలు, మంచి వేతనాలు ఇప్పిస్తామంటూ పలువురు మహిళలను నిందితులు నమ్మించారు. మహిళలను భారత్‌కు తీసుకొచ్చిన అనంతరం బలవంతంగా వ్యభిచారంలోకి దింపినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో నిర్ధారణ అయింది.


2019 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌‌లో ఈ కేసును పోలీసులు నమోదు చేశారు. జల్‌పల్లిలోని వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురు బంగ్లాదేశ్‌ మహిళలకు పోలీసులు విముక్తి కల్పించారు. బాలాపూర్‌ మహ్మద్‌ కాలనీలోని ఓ ఇంటి నుంచి మరో మహిళను పోలీసులు రక్షించారు. అనంతరం ఈ కేసును స్వాధీనం చేసుకుని ఏన్ఐఏ అధికారులు రీ-రిజిస్టర్‌ చేశారు. A1 నుంచి A12 వరకు మొత్తం 12 మందిపై చార్జిషీట్‌ దాఖలు చేశారు.


వీరిలో A1, A3, A7 నిందితులు పరారీలో ఉన్నట్లు ఏన్ఐఏ అధికారులు వెల్లడించారు. 2020 అక్టోబర్‌ 17వ తేదీన ఏన్ఐఏ అధికారులు న్యాయస్థానంలో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 2019 – 2020 మధ్య తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ తదితర ప్రాంతాల్లో నిందితులను ఏన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. నిందితులకు రూ.1.37 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. ఈ జరిమానా చెల్లించకపోతే అదనంగా 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించాలని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

ఆ భూమిని హరీశ్‌రావు కుటుంబం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది?: మంత్రి పొంగులేటి

అసెంబ్లీలో మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తా: రాకేశ్ రెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 11:34 AM