Share News

అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా వ్యాపించిన మంటలు..

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:13 PM

అమీర్‌పేటలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీనివాసనగర్ వెస్ట్‌లో, మెట్రో పిల్లర్ నంబర్ - A1043 సమీపంలో ఉన్న కేఎస్సార్ ఫ్యాషన్స్‌ దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అమీర్‌పేటలో  భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా వ్యాపించిన మంటలు..
Maitrivanam Fire Accident

హైదరాబాద్‌, జూన్4 (ఆంధ్రజ్యోతి): అమీర్‌పేటలో ఈరోజు (గురువారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీనివాసనగర్ వెస్ట్‌లో, మెట్రో పిల్లర్ నంబర్ - A1043 సమీపంలో ఉన్న కేఎస్సార్ ఫ్యాషన్స్‌ దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


మంటలు వేగంగా వ్యాపించకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దట్టమైన పొగ కారణంగా పరిసర ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. భవనంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగిందనే విషయంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు

యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి: కోటంరెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 04 , 2026 | 02:28 PM