హెచ్ఎండీఏ భూముల వేలానికి షాక్.. కొనుగోలుకు ముందుకు రాని ఇన్వెస్టర్లు
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:32 PM
హెచ్ఎండీఏ మూసాపేట, కోకాపేట నియోపోలీస్ భూముల వేలానికి స్పందన కరువైంది. మూసాపేట ట్రక్ పార్క్, కోకాపేట నియో పోలీస్ భూముల వేలంలో ఇన్వెస్టర్లు, రియల్టర్లు పాల్గొనలేదు.
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): హెచ్ఎండీఏ (HMDA Land Auctions) మూసాపేట, కోకాపేట నియోపోలీస్ భూముల వేలానికి స్పందన కరువైంది. మూసాపేట ట్రక్ పార్క్, కోకాపేట నియో పోలీస్ భూముల వేలంలో ఇన్వెస్టర్లు, రియల్టర్లు పాల్గొనలేదు. ఈ-వేలంలో ఒక్క బిడ్ కూడా దాఖలు కాని పరిస్థితి నెలకొంది. మూసాపేటలో 3.15 ఎకరాల భూమి వేలానికి హెచ్ఎండీఏ ఈ ఆక్షన్ పెట్టింది. కోకాపేట నియో పోలీస్ లేఅవుట్‌లో 4.59 ఎకరాల భూమికి ఈ ఆక్షన్ నిర్వహించింది. మూసాపేటలోని సర్వే నంబర్లు - 121/ఏ నుంచి 141, 146, 147, 155 నుంచి 157 వరకు భూములను హెచ్ఎండీఏ వేలంలో పెట్టింది.
అలాగే, కోకాపేటలోని సర్వే నంబర్లు - 239, 240లో 4.59 ఎకరాల భూమికి కూడా ఈ ఆక్షన్‌ను హెచ్ఎండీఏ నిర్వహించింది. మూసాపేట భూములకు ఎకరాకు కనీస ధర రూ.99 కోట్లగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. అయితే, భూముల కొనుగోలుకు ఇన్వెస్టర్లు, రియల్టర్లు ఆసక్తి చూపలేదు. భూముల కొనుగోలుకు బిడ్డర్లు ముందుకు రాలేదు. ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దని బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. రెండురోజుల క్రితం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి అనుకుని ఉన్న హుడా పార్క్ లే ఔట్‌లో ఓపెన్ ప్లాట్‌లకు కూడా ఆదరణ కరువైంది.
ఈ వార్తలు కూడా చదవండి...
పాలమూరును తెలంగాణకే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సీఎం రేవంత్‌రెడ్డి
‘సర్’ పై విమర్శలు చేసే నైతిక హక్కు రేవంత్‌కు లేదు.. బండి సంజయ్ ధ్వజం
పోలీస్ డ్యూటీ మీట్‌లో సైబరాబాద్ ఓవరాల్ ఛాంపియన్: డీజీపీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News