Share News

సీఎం హోదాలో ఉండి అబద్ధాలు చెబితే నిజాలు అయిపోవు: హరీశ్ రావు

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:56 PM

తెలంగాణలో వలసలకు కాంగ్రెస్‌యే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణకు నీళ్లు ఎత్తిపోయమంటే రేవంత్ దుమ్మెత్తిపోస్తున్నారంటూ మండిపడ్డారు.

సీఎం హోదాలో ఉండి అబద్ధాలు చెబితే నిజాలు అయిపోవు: హరీశ్ రావు
telangana water issues

హైదరాబాద్, నవంబరు 24: తెలంగాణలో వలసలకు కాంగ్రెస్‌యే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణకు నీళ్లు ఎత్తిపోయమంటే రేవంత్ దుమ్మెత్తిపోస్తున్నారంటూ మండిపడ్డారు.


‘సీఎం హోదాలో ఉండి అబద్ధాలు చెబితే.. అవి నిజాలు అయిపోవు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. మేం నీళ్ల లెక్కలు అడిగితే.. సీఎం నైరాశ్యంతో మాట్లాడుతున్నారు. తెలంగాణకు కృష్ణా నది నీళ్లను ఎత్తిపోయమంటే.. దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రబాబు ఏజెంట్‌ను రేవంత్ పక్కన పెట్టుకున్నాడు. తెలంగాణలో వలసలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం’ అంటూ హరీశ్ రావు కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరల్లో మళ్లీ పెరుగుదల.. నేడు ఎలా ఉన్నాయంటే..

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 01:57 PM