నేటి నుంచి మట్టి గణేశ్‌ల పంపిణీ
ABN , Publish Date - Sep 09 , 2026 | 07:26 AM
గణేశ్ చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణనాథులనే ప్రతిష్ఠించాలని హెచ్‌ఎండీఏ పిలుపునిచ్చింది.
34 ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు
హైదరాబాద్ సిటీ: గణేశ్ చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణనాథులనే ప్రతిష్ఠించాలని హెచ్‌ఎండీఏ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పర్యావరణ హితం కోరుతూ నగరవాసులకు 1.33 లక్షల మట్టి గణనాథులను బుధవారం నుంచి ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. నగరవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో మట్టి గణనాథులను పంపిణీ చేయడానికి అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
1.33లక్షల మట్టి గణనాథుల్లో 53వేల ప్రతిమలు ఒక అడుగు ఎత్తుతో ఉండగా.. 80వేల ప్రతిమలు 8ఇంచుల ఎత్తుతో ఉన్నాయి. హెచ్‌ఎండీఏ పంపిణీ చేయనున్న విగ్రహాలకు సంబంధించిన ఇతర వివరాలకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్‌ను 9849906745 ఫోన్ నంబర్‌లో, డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గణేష్‌ను 7989371104 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
పంపిణీ చేసే ప్రాంతాలు
9, 10 తేదీల్లో.. బండ్లగూడ బస్‌డిపో, సుందరయ్య పార్కు దగ్గర బుధవారం పంపిణీ చేయనుండగా.. జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ సైలెంట్ వ్యాలీహిల్స్, హైటెక్‌సిటీ శిల్పారామం, సైనిక్‌పురిలో భారతీయ విద్యా భవన్, కుందన్‌బాగ్ ఐఏఎస్ కాలనీ, మాదాపూర్ మైండ్‌స్పేస్ జంక్షన్, సరూర్‌నగర్ ప్రియదర్శిని పార్కు, నారాయణగూడ మెల్కోటే పార్కు, ఉప్పల్ శిల్పారామం, తార్నాక కమర్షియల్ కాంప్లెక్స్‌లో బుధ, గురువారాల్లో పంపిణీ చేయనున్నారు. అమీర్‌పేట మైత్రీవనంలో స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లో బుధవారం నుంచి శుక్రవారం వరకు పంపిణీ చేయనున్నారు.

10, 11 తేదీల్లో కేబీఆర్ పార్కు, గ్రీన్ ల్యాండ్ హోటల్ సమీపంలో, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, కొత్వాల్‌గూడ ఎకోపార్కు, ట్యాంక్‌బండ్, సచివాలయం, మాదాపూర్ మై హోమ్ నవద్వీప సమీపంలో, నానక్‌రాంగూడ హెచ్‌జీసీఎల్ కార్యాలయం.
11వ తేదీన హైకోర్టు, సికింద్రాబాద్ గణేష్ ఆలయం
11, 12 తేదీల్లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్, వనస్థలిపురం రాజీవ్‌గాంధీ పార్కు, వాయుపురి రిక్రియేషన్ సెంటర్.
12వ తేదీన మెహిదీపట్నం రైతుబజార్, దుర్గంచెరువు పార్క్ ప్రవేశ ద్వారం, పాతబస్తీలోని వేదిక్ ధర్మప్రకాశ్ స్కూల్, కూకట్‌పల్లి మెట్రో క్యాష్ అండ్ క్యారీ.
12, 13 తేదీల్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం, ఎన్టీఆర్ గార్డెన్ పక్కన హెచ్‌ఎండీఏ గ్రౌండ్.
13న సఫిల్‌గూడ పార్కు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరల్లో ఊగిసలాట.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News