వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
ABN , Publish Date - Sep 09 , 2026 | 06:35 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోగా క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
ఆదివారం హుండీ ఆదాయం: రూ.4.75 కోట్లు
సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య: 69,440
తలనీలాలు సమర్పించినవారు: 36,255మంది
ఈ వార్తలు కూడా చదవండి:
కోనసీమలో గ్రౌండ్ రెంట్ భూములకు విముక్తి
Read Latest AP News And Telangana News And International News And Telugu News