Share News

పిరికి జడ్జి అనిపించుకోవడం కన్నా చావడం మేలు

ABN , Publish Date - Sep 09 , 2026 | 05:47 AM

గడిచిన నాలుగు నెలల్లో 22మందికి మరణశిక్ష విధించి వార్తల్లో నిలిచిన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి రవికుమార్‌...

పిరికి జడ్జి అనిపించుకోవడం కన్నా చావడం మేలు

  • 4నెలల్లో 23 మరణశిక్షలు విధించిన యూపీ జడ్జి రవి

ముజఫర్‌నగర్‌, సెప్టెంబరు 8: గడిచిన నాలుగు నెలల్లో 22మందికి మరణశిక్ష విధించి వార్తల్లో నిలిచిన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి రవికుమార్‌ తాజాగా మరొక వ్యక్తికి ఉరిశిక్ష వేశారు. కట్నం కోసం భార్యను సజీవ దహనం చేసిన నదీమ్‌ అనే దోషికి మంగళవారం మరణ శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. ‘‘ఆ జడ్జి పిరికివాడు అనిపించుకోవడం కంటే చావడం మేలు’’ అని ఆ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. తనకు మాఫియా, గ్యాంగ్‌స్టర్లు, క్రిమినల్స్‌ నుంచి బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. తన విధులు నిర్వర్తించకుండా వారు ఉన్నతాధికారుల సాయంతో ఒత్తిడి తెస్తున్నారని, సీరియస్‌ నేరాలకు సంబంధించిన దాదాపు వంద కేసులను తన బెంచ్‌ నుంచి తప్పించారని ఆరోపించారు. కాగా, అధికారులు రవికుమార్‌ భద్రతను కూడా తగ్గించినట్లు తెలిసింది. దీనిపై ఆయన అభ్యంతరం తెలిపారని, భద్రతను పెంచాలని అధికారులను కోరారని సమాచారం.

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా

రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 09 , 2026 | 05:47 AM