Share News

రూ.7కు కక్కుర్తి పడితే 7లక్షల జరిమానా!

ABN , Publish Date - Sep 09 , 2026 | 06:05 AM

వాటర్‌బాటిల్‌ను ఎమ్మార్పీకి మించి విక్రయించినందుకు షాపు నిర్వాహకులకు వినియోగదారుల ఫోరం గట్టి షాక్‌ ఇచ్చింది. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం ఆవరణలో ఈఏడాది ఫిబ్రవరి 22న ఓ ఫ్యాన్సీ, కూల్‌డ్రింక్‌ దుకాణంలో పిఠాపురానికి చెందిన భక్తుడు వెంకటేశ్వరరావు వాటర్‌ బాటిల్‌ కొనుగోలు చేశాడు.

రూ.7కు కక్కుర్తి పడితే 7లక్షల జరిమానా!

అన్నవరం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): వాటర్‌బాటిల్‌ను ఎమ్మార్పీకి మించి విక్రయించినందుకు షాపు నిర్వాహకులకు వినియోగదారుల ఫోరం గట్టి షాక్‌ ఇచ్చింది. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం ఆవరణలో ఈఏడాది ఫిబ్రవరి 22న ఓ ఫ్యాన్సీ, కూల్‌డ్రింక్‌ దుకాణంలో పిఠాపురానికి చెందిన భక్తుడు వెంకటేశ్వరరావు వాటర్‌ బాటిల్‌ కొనుగోలు చేశాడు. ఎమ్మార్పీ రూ.18 ఉంటే రూ.25 తీసుకోవడంతో కాకినాడ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. దీనిపై ఫోరం అధ్యక్షుడు రఘుపతి వసంత్‌కుమార్‌, సభ్యులు శశి, నాగేశ్వరరావు మంగళవారం తీర్పు చెబుతూ.. భక్తుడి నుంచి అదనంగా వసూలు చేసిన ఏడు రూపాయలతోపాటు.. కోర్టు ఖర్చుల కింద రూ.10వేలతో పాటుగా వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.7లక్షలు చెల్లించాలని ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి...

పడక గది ప్రశాంతంగా...

బ్యాంకుకు రమ్మంటే భర్త రాలేదని..

Updated Date - Sep 09 , 2026 | 06:05 AM