12న జాతీయ లోక్‌అదాలత్
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:56 PM
Cooperate in settling the cases ‘జిల్లాలో ఈ నెల 12న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నాం. ఇందులో ఎక్కువ కేసుల రాజీకి అందరూ సహకరించాల’ని జిల్లా న్యాయాధికారి కొండబోలు సునీత పిలుపునిచ్చారు.
కేసుల రాజీకి సహకరించండి
జిల్లా న్యాయాధికారి సునీత
శ్రీకాకుళం లీగల్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో ఈ నెల 12న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నాం. ఇందులో ఎక్కువ కేసుల రాజీకి అందరూ సహకరించాల’ని జిల్లా న్యాయాధికారి కొండబోలు సునీత పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా కోర్టు భవనంలో పోలీసులు, బ్యాంకు, ఇన్సూరెన్స్, చిట్‌ఫండ్, ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా న్యాయాధికారి సునీత మాట్లాడుతూ ‘లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కేసుల్లో కోర్టు ఫీజు పూర్తిగా తిరిగి ఇవ్వడమే కాకుండా ఆ రాజీ ఒప్పంద పత్రానికి అప్పీల్ కూడా ఉండదు. ఇరుపక్షాలు రాజీమార్గం ద్వారా వివాదం పరిష్కరించుకోవడంతో వారి మధ్య శత్రుత్వం కన్నా మిత్రత్వం పెరుగుతుంది. పోలీసులు, బ్యాంకు అధికారులు కక్షి దారులతో మాట్లాడి ఎక్కువ కేసులు రాజీ అయ్యేందుకు ప్రయత్నించాలి. కేసుల రాజీవల్ల సమయం, డబ్బు ఆదాచేయడమే కాకుండా న్యాయవ్యవస్థకూ మేలు జరుగుతుంది. అటవీ శాఖ, క్రిమినల్ కాంపౌండబుల్, లేబర్ తదితర కేసులపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించగలం. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు తమ సెటిల్‌మెంట్ అధికారులతో రావాలి. న్యాయవాదులు ముందుగానే తమ క్లయింట్లతో రాజీకి ప్రోత్సహించి మాట్లాడాల’ని సూచించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తదితరులు పాల్గొన్నారు