Share News

ఉదయం పొగమంచు.. మధ్యాహ్నం ఎండ

ABN , Publish Date - Mar 10 , 2026 | 08:15 AM

శివారు ప్రాంతాల్లో ఉదయం పొగ మంచు కురుస్తుంటే, మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భిన్న వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఉదయం పొగమంచు.. మధ్యాహ్నం ఎండ

  • తెల్లవారుజామున ప్రధాన రహదారులను కప్పేస్తున్న పొగమంచు

  • మధ్యాహ్నం 37 నుంచి 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ సిటీ: శివారు ప్రాంతాల్లో ఉదయం పొగ మంచు కురుస్తుంటే, మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భిన్న వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెల్లవారుజామున ప్రధాన రహదారులను పొగమంచు కమ్మేయడంతో ప్రధాన రహదారులపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.


city3.2.jpgమధ్యాహ్నం 37 డిగ్రీలు

నగరంలో మధ్యాహ్నం నమోదవుతున్న 37 నుంచి 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నగర వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గ్రేటర్‌ పరిధిలో 30కి పైగా ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం సరూర్‌నగర్‌లో అత్యధికంగా 37.3, బేగంపేట(Begumpet)లో 37.2, కాప్రాలో 37.2, హయత్‌నగర్‌లో 37.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతేడాది మార్చిలో కంటే ఈ సంవత్సరం 1-2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలుంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.


సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు

ప్రాంతం - ఉష్ణోగ్రతలు

సరూర్‌నగర్‌ 37.3

బేగంపేట 37.2

కాప్రా 37.2

అంబర్‌పేట 37.1

హయత్‌నగర్‌ 37.0

మెహిదీపట్నం 36.7

ఎల్‌బీనగర్‌ 36.7

కుత్బుల్లాపూర్‌ 36.5

చందానగర్‌ 36.5


ఈ వార్తలు కూడా చదవండి:

ఢిల్లీ మద్యం స్కాం రౌజ్‌ ఎవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే

వెంకటేశ్‌నాయుడు విచారణకు అనుమతివ్వండి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 10 , 2026 | 08:15 AM