Share News

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. సోఫాల తయారీ దుకాణంలో ఒక్కసారిగా మంటలు..

ABN , Publish Date - Mar 16 , 2026 | 06:32 PM

హైదరాబాద్ ఫలక్‌నుమా ఫరూఖ్‌నగర్‌లో బస్‌డిపో సమీపంలోని సోఫాల తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి నుంచి మంటలు పక్కనే ఉన్న ఫర్నిచర్ షాపు, ఇతర దుకాణాలకు వ్యాపించాయి.

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. సోఫాల తయారీ దుకాణంలో ఒక్కసారిగా మంటలు..
Hyderabad Fire Accident

హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరంలోని ఫలక్‌నుమా ప్రాంతంలో ఈరోజు(సోమవారం) అగ్నిప్రమాదం (Hyderabad Fire Accident) జరిగింది. ఫలక్‌నుమా ఫరూఖ్‌నగర్‌లోని బస్‌డిపో సమీపంలో ఉన్న సోఫాల తయారీ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం నెలకొంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


ఒక్కసారిగా మంటలు...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోఫాల తయారీ షాపులో మొదలైన మంటలు వేగంగా వ్యాపించాయి. అక్కడ ఎక్కువగా ఫోమ్, చెక్క సామగ్రి, ఫర్నిచర్ వస్తువులు ఉండటంతో మంటలు వేగంగా విస్తరించాయి. సోఫాల తయారీ దుకాణంలో ప్రారంభమైన మంటలు పక్కనే ఉన్న ఫర్నిచర్ షాపు, ఇతర చిన్న దుకాణాలకు కూడా వ్యాపించాయి. దీంతో అక్కడి వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. కొన్ని దుకాణాల నుంచి వస్తువులను బయటకు తీసి నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.


మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు..

సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు కూడా మంటలను ఆర్పేందుకు సహకరించారు. మంటలను నియంత్రించేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. ఫోమ్, చెక్క వంటి పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


భారీ నష్టం సంభవించే అవకాశం..

ఈ అగ్నిప్రమాదంలో దుకాణాల్లో ఉన్న ఫర్నిచర్ వస్తువులు, సోఫాలు, ఇతర సామగ్రి దగ్ధమయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయంపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మంటలను పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే ఈఘటనకు జరగడానికి అసలు కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొయినాబాద్‌ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌

రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 16 , 2026 | 07:01 PM