పెద్దమనుషులతో సెటిల్‌మెంట్ ఆఫర్.. అషురెడ్డి ఆడియో వైరల్..!
ABN , Publish Date - Apr 28 , 2026 | 01:40 PM
బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ సినీనటి అషురెడ్డి వివాదంలో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితుడు ఎన్నారై ధర్మేంద్రకు అషురెడ్డి పంపినట్లుగా చెబుతున్న ఒక వాయిస్ రికార్డ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఆడియో రికార్డులో సెటిల్‌మెంట్ ప్రతిపాదనలు, బెదిరింపులు ఉండటం ఈ కేసును మరింత క్లిష్టంగా మార్చినట్లు సమాచారం.
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి):: బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ సినీనటి అషురెడ్డి (Famous Actress Ashu Reddy) వివాదంలో సంచలన మలుపులు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి పేరుతో రూ. 9.83 కోట్ల మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ కేసులో బాధితుడు ధర్మేంద్రకు అషురెడ్డి పంపిన ఆడియో మెసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాయిస్ రికార్డ్‌లో ఏం ఉందంటే..?
బయటపడ్డ ఆడియో ఆధారంగా అషురెడ్డి పలు డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. తన తరఫున జ్యోతిష్యుడు వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణా అక్క వస్తారని.. అందరం కలిసి కూర్చుని సెటిల్ చేసుకుందామని అషురెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం.
రూ. 1.5 కోట్ల సెటిల్‌మెంట్..
‘నాకు మే నెల వరకు సమయం ఇస్తే రూ. 1.5 కోట్లు సెటిల్ చేస్తాను. ప్రస్తుతానికి మే నెలే నాకు టార్గెట్‌గా కనిపిస్తోంది. మిగిలిన డబ్బును నేను జీవితంలో స్థిరపడిన తర్వాత తిరిగి ఇస్తాను’ అని ఆమె పేర్కొన్నట్లు ఆడియోలో ఉంది. ఈ వివాదంలోకి తన తల్లిని, సోదరిని (దివ్యారెడ్డి) లాగవద్దని, కేవలం తనతోనే మాట్లాడాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది.
ఎదురుదాడి..
కేవలం సెటిల్‌మెంట్ మాత్రమే కాకుండా, బాధితుడిని ఆమె బెదిరించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘సెటిల్‌మెంట్‌కు ఒప్పుకోకపోతే, నీపై వేధింపుల కేసు పెడతాను. నేను నీ ముఖం చూడాలని అనుకోవడం లేదు, ఈ విషయం గురించి మాట్లాడటం ఇష్టం లేదు’ అంటూ కఠినంగా స్పందించినట్లు ఆడియో ద్వారా వెల్లడవుతోంది.
బాధితుడు ధర్మేంద్ర వెర్షన్..
ఈ వాయిస్ రికార్డులు బయటపడటంతో బాధితుడు ధర్మేంద్ర తన ఆవేదనను వ్యక్తం చేశారు. తన నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి, ఇప్పుడు కేవలం ఒక కోటి రూపాయలతో సెటిల్ చేస్తాననడం మోసమని ఆయన వాదిస్తున్నారు. అంతేకాకుండా, డబ్బు అడిగితే రివర్స్ కేసు పెడతానని బెదిరించడం అన్యాయమని పేర్కొన్నారు.
విచారణలో ఆడియో కీలకం..
ఇప్పటికే అషురెడ్డిపై పోలీసుల నాన్ బెయిలబుల్ కేసు నమోదైన నేపథ్యంలో, ఈ తాజా వాయిస్ రికార్డ్ పోలీసు విచారణలో అత్యంత కీలకంగా మారనుంది. ఆమె నిజంగానే సెటిల్‌మెంట్ పేరుతో కాలయాపన చేసిందా?, రాజకీయ లేదా సినిమా రంగ ప్రముఖుల పేర్లు చెప్పి బాధితుడిని భయపెట్టిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం.. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. కేటీఆర్, హరీశ్‌రావు భావోద్వేగ ట్వీట్లు
Read Latest Telangana News And AP News And International News And Telugu News