అట్టికా గోల్డ్‌పై ఈడీ సోదాలు.. భారీగా విదేశీ కరెన్సీ, బంగారం, వెండి సీజ్
ABN , Publish Date - Sep 29 , 2026 | 01:33 PM
అట్టికా గోల్డ్‌పై ఈడీ అధికారులు మంగళవారం ఏకకాలంలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. 16 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): అట్టికా గోల్డ్‌పై ఈడీ అధికారులు ఈరోజు (మంగళవారం) ఏకకాలంలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. 16 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నైలో రైడ్స్ చేశారు. అట్టికా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు, షేర్ హోల్డర్స్, అనుబంధ సంస్థల్లో ఈ సోదాలు నిర్వహించారు. దొంగతనం చేసిన బంగారాన్ని అట్టికా గోల్డ్ నిర్వాహకులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు.
ఈ తనిఖీల్లో అక్రమ బంగారం ద్వారా భారీగా ఆదాయం వచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అక్రమ లావాదేవీలపై ఆరా తీశారు. ఈ సోదాల్లో భారీగా విదేశీ కరెన్సీ, బంగారం, వెండి సీజ్ చేశారు. ఆయుబ్ సహా పలువురు వ్యక్తుల నివాసాల్లో ఈ రైడ్స్ చేపట్టారు. తమ విచారణకు సహకరించకుండా కొందరు పరారైనట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ సోదాల్లో పలు ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకుని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దిమ్మ తిరిగే రిజల్ట్స్ వస్తాయి: దానం నాగేందర్
భాగ్యనగరంలో మైకుల మోతపై నటుడు అల్లు శిరీశ్ ఫిర్యాదు
ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News