మూడు రోజుల వ్యాపారానికీ జీఎస్టీ
ABN , Publish Date - Nov 07 , 2026 | 07:44 AM
దీపావళి కాంతుల సంగతేమో కానీ.. అధికారుల మామూళ్లు, లైసెన్సుల ఫీజులతో పాటు ఈసారి కొత్తగా జీఎస్టీ వసూళ్లు తమకు చుక్కలు చూపెడుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు.
దీపావళి వ్యాపారులను హడలెత్తిస్తున్న లైసెన్సుల ఫీజులు
సాధారణ అనుమతులతోపాటు కొత్తగా జీఎస్టీ వసూళ్లు
చిన్నపాటి షాపుపైనా రూ.15 వేల నుంచి 20 వేల వరకు భారం
అంతిమంగా సామాన్యులపై ధరల ప్రభావం
హైదరాబాద్ సిటీ: దీపావళి కాంతుల సంగతేమో కానీ.. అధికారుల మామూళ్లు, లైసెన్సుల ఫీజులతో పాటు ఈసారి కొత్తగా జీఎస్టీ వసూళ్లు తమకు చుక్కలు చూపెడుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. గతంతో పోల్చితే ఈసారి అన్ని ఫీజులూ అధికం కావడంతో అసలు దుకాణం పెట్టాలా.. వద్దా.. అని చాలామంది ఆలోచిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో సుమారు 30-40 మంది హోల్‌సేల్ వ్యాపారులున్నారు. వీరి ద్వారా కేవలం 20 శాతం మాత్రమే వ్యాపారం జరుగుతుండగా, మిగిలిన 80 శాతం అసంఘటిత రంగంలోని రిటైల్ వ్యాపారుల ద్వారా లేదంటే ఆన్లైన్లో జరుగుతుంటాయి.
పెరిగిన ధరలు..
గతంలో బాణాసంచా కొనుగోలుకు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు ఖర్చు చేసిన వినియోగదారులు ఇప్పుడు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకే కొనుగోళ్లను పరిమితం చేస్తున్నారని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడడంతో పాటు రసాయనాలు, ముడి పదార్థాల ధరలు పెరిగాయని, దానితో టపాసుల ఉత్పత్తి ఖర్చులు కూడా పెరిగాయని పేర్కొంటున్నారు. భద్రతా ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ టపాసుల ఫ్యాక్టరీలను ఎక్కువ కాలం మూసి ఉంచడం తో ఉత్పత్తి కూడా తగ్గిందని శివకాశీ వ్యాపారులు చెబుతున్నారని వెల్లడించారు. గతంతో పోలిస్తే ఈసారి టపాసుల ఉత్పత్తి వ్యయం 30 శాతానికి పైగానే పెరిగిందని, అయితే ఆ భారం మొత్తం కొనుగోలుదారులపై వేయకుండా తాము కూడా కొంత భరిస్తున్నామని చెబుతున్నారు. రిటైల్ ధరలను పెంచకూడదని ఆల్ ఇండియా ఫైర్వర్క్స్ అసోసియేషన్ నిర్ణయించింది కానీ, మొత్తం భారం తమపై వేసుకుని వ్యాపారం చేయడం అసాధ్యమని వాపోతున్నారు.
కొత్తగా జీఎ్‌సటీ ఫీజు భారం
సాధారణంగా దీపావళి బాంబుల దుకాణం పెట్టాలంటే పలు శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి. మొదటగా అగ్నిమాపక శాఖ పర్మిషన్, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్, పోలీస్ శాఖల నుంచి తీసుకోవాలి. ఈసారి కొత్తగా జీఎ్‌సటీ నిబంధనలు జత కలిశాయి. ఆయా శాఖల అనుమతుల కోసం ఒక్కో దుకాణానికి లైసెన్సింగ్ ఫీజులు రూ.20 వేల నుంచి రూ.25 వేలు అవుతుండగా.. కొత్తగా తీసుకొచ్చిన జీఎ్‌సటీ ఫీజు సుమారుగా రూ.15వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నట్లు పలువురు వాపోతున్నారు.
మూడు రోజుల వ్యాపారానికి జీఎస్టీ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికి తోడు ‘మామూళ్లు’ కూడా ఉంటాయని, ఒక దుకాణం ఏర్పాటుకు మొత్తం కలుపుకుంటే రూ. 60 వేల నుంచి రూ.70 వేలు ఖర్చు వస్తుందని, ఇక షెడ్డు, సెక్యూరిటీ, అద్దెలు, తదితరాలు వేసుకుంటే రూ.1.50 లక్షల వరకు అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దుకాణంలో సరుకును కనీసం రూ.2లక్షల నుంచి రూ.3 లక్షల వరకైనా పెట్టాలని చెబుతున్నారు. అయితే ఇంత పెట్టినా.. కూడా గిరాకీ ఉంటుందో.. లేదో అంచనా వేయలేమంటున్నారు.
వీటన్నింటిని భరించాలంటే ధరలను 20-25 శాతం పెంచాల్సి వస్తోందని తెలిపారు. అంతిమంగా ప్రజలకూ ఇబ్బందే అంటున్నారు. తాను యూస్‌ఫగూడ దగ్గర ప్రతీ ఏటా దీపావళి టపాసులు అమ్మేవాడినని, పెరిగిన ధరలతో వ్యాపారం గిట్టుబాటు కాదనిపించి దూరంగా ఉన్నట్లు రాజారామ్ తెలిపారు. ఇదిలా ఉండగా, ఏటా తాము కనీసం రూ.4వేల నుంచి రూ.5వేల విలువైన టపాసులు కొనుగోలు చేస్తామని, గతేడాది నుంచి సగం తగ్గించుకున్నామని, పిల్లల స్కూళ్లలో కాలుష్యంపై అవగాహన కల్పిస్తుండడం దీనికి ఓ కారణమని మోతీనగర్‌కు చెందిన లక్ష్మీ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
పెరటి తోటకు నల్లా నీరు.. రూ.5వేల జరిమానా
Read Latest AP News And Telangana News And International News And Telugu News