పెరటి తోటకు నల్లా నీరు.. రూ.5వేల జరిమానా
ABN , Publish Date - Nov 07 , 2026 | 06:52 AM
పెరటి తోటకు నల్లా నీటిని వినియోగించిన ఓ గృహస్థుడికి రూ.5 వేల జరిమానా పడింది.
నీటివృథాను అరికట్టేందుకు బంగారిగడ్డ పంచాయతీ చర్యలు
చండూరురూరల్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పెరటి తోటకు నల్లా నీటిని వినియోగించిన ఓ గృహస్థుడికి రూ.5 వేల జరిమానా పడింది. నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డలో నీటిని వృథా చేయొద్దంటూ శుక్రవారం పంచాయతీ సిబ్బంది మైక్ ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో వేముల నర్సింహ అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలోని తోటకు నల్లా నీటిని వినియోగిస్తుండగా, పంచాయతీ కార్యదర్శి, ఇన్‌చార్జి ఎంపీవో కోటయ్య గుర్తించారు. దీంతో నర్సింహకు రూ.5 వేల జరిమానా విధించారు. 24 గంటల్లో జరిమానా చెల్లించాలని, మళ్లీ ఇలాంటి ఘటనకు పాల్పడితే నల్లా కనెక్షన్‌ను శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News