Share News

13న అల్పపీడనం

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:25 AM

ఆగ్నేయ బంగాళాఖాతంలో 13న అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

13న అల్పపీడనం

విశాఖపట్నం, అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో 13న అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అది పశ్చిమ వాయవ్యంగా పయనించి 15 నాటికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించనుందని పేర్కొంది. అయితే ఈ వాయుగుండం బలపడుతుందా..?, తమిళనాడు తీరం దిశగా వస్తుందా...? అనేది మాత్రం చెప్పలేదు.

అయితే వాయుగుండంగా బలపడిన తర్వాత ఇది దిశ మార్చుకుని బంగ్లాదేశ్‌, మయన్మార్‌ వైపు పయనిస్తుందని పలువురు నిపుణులు విశ్లేషించారు. వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలోకి వచ్చే సమయంలో తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. శనివారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 01:26 AM