Share News

దివ్వెల్లా వెలిగిపోండి!

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:52 AM

దీపావళి పండుగ మేకప్‌ మిరుమిట్లుగొలపాలంటే, వెలుగులు విరజిమ్మే మేకప్‌ చిట్కాలను పాటించాలి. అలాగే పండుగనాడు సందర్భానుసారమైన మేకప్‌ టెక్నిక్స్‌ను ఎంచుకోవాలి.

దివ్వెల్లా వెలిగిపోండి!

దీపావళి పండుగ మేకప్‌ మిరుమిట్లుగొలపాలంటే, వెలుగులు విరజిమ్మే మేకప్‌ చిట్కాలను పాటించాలి. అలాగే పండుగనాడు సందర్భానుసారమైన మేకప్‌ టెక్నిక్స్‌ను ఎంచుకోవాలి.

బంధువులందరూ కలిసి కాలక్షేపం చేసే సమయమైనా, అందరూ కలిసి భోంచేసే సమయమైనా, సాయంకాలం వేళ వేడుకలో పాల్గొనే సందర్భమైనా అందుకు తగిన మేక్‌పను ఎంచుకోవాలి. దీపపు కాంతులకు వెలవెలబోకుండా, మిరుమిట్లుగొలిపే టపాసుల మెరుపుల్లో మెరుపుతీగలా మెరిసిపోవడం కోసం ఇవిగో ఈ మేకప్‌ కిటుకులు పాటించాలి.

తళుక్కుమనే కళ్ల కోసం...

దీపావళి నాడు గోల్డ్‌ ఐ మేక్‌పను ఎంచుకోవాలి. ప్రత్యేకించి భారతీయ ఆభరణాల టోన్స్‌, ఐవరీ లేదా మెటాలిక్‌ షేడ్స్‌ను ఎంచుకోవాలి. కనురెప్పల మీద షాంపేన్‌ గోల్డ్‌ ఐషాడోతో మృదువైన మెరుపు సమకూరుతుంది. బ్రాంజ్‌లేదా యాంటిక్‌ గోల్డ్‌ పిగ్మెంట్స్‌తో కళ్లలో వేడుక కళ ఉట్టిపడుతుంది. కళ్ల అందాన్ని రెట్టింపు చేయడం కోసం, కోల్‌తో సన్నని కాటుక పూసి, దాన్ని ఐలైనర్‌తో, మస్కారాతో బ్లెండ్‌ చేయాలి.

మెరిసే పెదవుల కోసం...

గ్లాసీ లిప్స్‌ పండుగ మేక్‌పను పరిపూర్ణం చేస్తాయి. అందుకోసం న్యూడ్‌ పింక్స్‌, పీచీ బీజ్‌, క్యారమెల్‌ షేడ్స్‌ను ఎంచుకోవచ్చు. గోధుమ రంగు లిప్‌ లైనర్‌తో పెదవులు చక్కని ఆకారాన్ని సంతరించుకుంటాయి. తర్వాత టింటెడ్‌ గ్లాస్‌తో పెదవులను నింపేస్తే, పెదవులు తళుక్కుమంటూ మెరుపులు చిందిస్తాయి.

చమక్కుమనే చర్మం కోసం...

పండగ శోభను సంతరించుకోవడం కోసం చర్మాన్ని కూడా సింగారించాలి. అందుకోసం లైట్‌ వెయిట్‌ ఫౌండేషన్‌, హైలైటర్‌ జత చేయాలి. రోజ్‌, పీచ్‌ లేదా సాఫ్ట్‌ బెర్రీ టోన్స్‌తో కూడిన క్రీమ్‌ బ్లష్‌ను చెక్కిళ్లకు అప్లై చేయాలి. ముక్కు, బ్రో బోన్స్‌కు హైలైటర్‌ అప్లై చేయాలి. ఈ చిట్కాలతో మెరుపులీనే మేకప్‌ సొంతమవుతుంది.

Updated Date - Nov 07 , 2026 | 12:54 AM