రష్యా సైన్యంలో చేరొద్దు
ABN , Publish Date - Nov 07 , 2026 | 06:33 AM
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతను రష్యా సైన్యంలోకి ఆకర్షించే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటర్నేషనల్ లీగల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఐఎల్పీయూ) ముఖ్య న్యాయ సలహాదారు, హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సూచించారు.
విదేశీ ఉద్యోగాల పేరుతో వచ్చే ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి
భారత పౌరసత్వాన్ని వదులుకోవడం సరికాదు
యువతకు ఐఎల్పీయూ న్యాయ నిపుణుల సూచన
బర్కత్‌పుర, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతను రష్యా సైన్యంలోకి ఆకర్షించే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటర్నేషనల్ లీగల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఐఎల్పీయూ) ముఖ్య న్యాయ సలహాదారు, హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సూచించారు. అధిక వేతనాలు, సులభంగా వీసాలు, శాశ్వత నివాసం, వివాహం వంటి ఆశ చూపుతూ వచ్చే అనుమానాస్పద ఆఫర్లను నమ్మవద్దని తెలుగు రాష్ట్రాల యువతకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. రష్యా సైన్యంలో చేరడం ప్రమాదకరమని, అనధికార ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.
డబ్బుకోసం రష్యా సైన్యంలో చేరడం, ఆ దేశ పాస్‌పోర్టు కోసం భారత పౌరసత్వాన్ని వదులుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. దీనివల్ల భవిష్యత్‌లో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత్ నుంచి సుమారు 3వేల మంది రష్యా సైన్యంలో చేరినట్లు సమాచారం ఉందని, వారిలో తెలంగాణ, ఏపీకి చెందిన యువత దాదాపు 20మంది వరకు ఉన్నారని వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులకు ఐఎల్పీయూ ఉచిత ప్రాథమిక న్యాయ సలహా అందిస్తుందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ కరణం రాజేష్ కుమార్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News