Share News

ఎన్నికల బకాయిలు చెల్లించాలి.. తెలంగాణ సీఈఓకు డిప్యూటీ కలెక్టర్ల వినతి

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:41 PM

తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డిని రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి గురువారం కలిశారు. ఎన్నికల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని కోరారు.

ఎన్నికల బకాయిలు చెల్లించాలి.. తెలంగాణ సీఈఓకు డిప్యూటీ కలెక్టర్ల వినతి
Telangana Deputy Collectors Association

హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డిని (CEO Sudarshan Reddy) రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి ఈరోజు (గురువారం) కలిశారు. ఎన్నికల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల బకాయిలు చెల్లించాలని విన్నవించారు. అదనపు ఎన్నికల వ్యయాలకు బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఈఓకు.. లచ్చిరెడ్డి వినతిపత్రం అందజేశారు. 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అదనపు ఖర్చులు అయ్యాయని తెలిపారు.


కేటాయించిన బడ్జెట్ సరిపోక అప్పులు చేసి ఎన్నికలను నిర్వహించినట్లు లచ్చిరెడ్డి వెల్లడించారు. అప్పులు ఇచ్చినవారి నుంచి అధికారులకు ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఆయా బకాయిల కోసం కోర్టులను రుణదాతలు ఆశ్రయిస్తున్నారని అన్నారు. అధికారుల కార్యాలయాలు, నివాసాలకు వెళ్లి డబ్బుల కోసం ఒత్తిడి తెస్తున్నారని చెప్పుకొచ్చారు.


అధికారుల గౌరవానికి భంగం కలుగుతోందని లచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు బడ్జెట్ ప్రతిపాదనలు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. నాంపల్లి, మల్కాజిగిరి నియోజకవర్గాల అదనపు బిల్లులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. పెండింగ్ ప్రతిపాదనలను తక్షణమే పరిశీలించి నిధులు విడుదల చేయాలని లచ్చిరెడ్డి విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యార్థుల యూనిఫాంలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క

భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు: మంత్రి పొంగులేటి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 07:34 PM