హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం
ABN , Publish Date - Jun 28 , 2026 | 08:49 AM
భాగ్యనగరంలోని పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో జీడిమెట్ల విలేజ్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొట్టింది.
హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలోని పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో జీడిమెట్ల విలేజ్ వద్ద ఈరోజు(ఆదివారం) ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన డీసీఎం పక్కనే వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డీసీఎం వాహనం అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 10 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే డీసీఎం డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న మేడ్చల్ ట్రాఫిక్ సీఐ మధుసూదన్, పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ రైజింగ్ విజన్‌కు ప్రపంచ దిగ్గజ కంపెనీల మద్దతు: సీఎం రేవంత్ రెడ్డి
సీషెల్స్ పర్యటనలో గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News