Share News

హైదరాబాద్‌లో భారీ చోరీ.. నేపాలీ దంపతుల అరెస్ట్

ABN , Publish Date - Jun 09 , 2026 | 08:48 PM

గచ్చిబౌలిలోని హిల్ రీడ్జ్ విల్లాలో నేపాలీ దొంగల దోపిడీ కేసును 24 గంటల్లో ఛేదించామని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 7 కిలోల బంగారం, కిలోన్నర వెండితో నిందితులు పరారయ్యారని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌లో భారీ చోరీ.. నేపాలీ దంపతుల అరెస్ట్
Gachibowli Robbery Case

హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలిలోని హిల్ రీడ్జ్ విల్లాలో నేపాలీ దొంగల దోపిడీ కేసును 24 గంటల్లో ఛేదించామని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 7 కిలోల బంగారం, కిలోన్నర వెండితో నిందితులు పరారయ్యారని చెప్పుకొచ్చారు. ఈరోజు(మంగళవారం) హైదరాబాద్ వేదికగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో డీసీపీ శ్రీనివాస్ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఇంటి ఓనర్లు ఐదు అడుగుల ఎత్తున్న లాకర్‌ కీని ఇంట్లో ఓ చెంబులో పెట్టి ఆ ఇంటి వారు బయటకు వెళ్లారని చెప్పుకొచ్చారు. దాన్ని గమనించిన నేపాలీ పనిమనిషి దంపతులు లాకర్ ఓపెన్ చేసి ఇంట్లో బంగారం, వెండి చోరీ చేశారని తెలిపారు.


ఆరు టీమ్స్ ఏర్పాటు చేసి నిందితుల కంటే ముందే నేపాలీ బార్డర్ వెళ్లి నిందితులను అరెస్ట్ చేశామని డీసీపీ శ్రీనివాస్ వివరించారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. పదికిలోల బంగారు, వెండి మూటను నాకాబందీ చేసి నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. రేపు (బుధవారం) అక్కడి న్యాయస్థానంలో హాజరు పరిచి హైదరాబాద్‌కి తీసుకుస్తామని చెప్పారు. ఇంట్లో నేపాలీ పని మనుషులను పెట్టుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని డీసీపీ శ్రీనివాస్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్‌

ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 09 , 2026 | 08:50 PM