Share News

భూమి సమస్యతో సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:35 PM

తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఈరోజు (బుధవారం) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూమి సమస్యకు న్యాయం చేయాలని కోరుతూ వచ్చిన ఓ దంపతులు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.

భూమి సమస్యతో సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం
Telangana Secretariat

హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఈరోజు (బుధవారం) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూమి సమస్యకు న్యాయం చేయాలని కోరుతూ వచ్చిన ఓ దంపతులు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొండా పోచమ్మపల్లి గ్రామానికి చెందిన పుట్ట కృష్ణయ్య, ఆయన భార్య సైదమ్మ తమ భూమికి సంబంధించిన సమస్యపై న్యాయం కోసం గత మూడు రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే తమ వినతిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ నేపథ్యంలో దంపతులు పెట్రోల్ డబ్బాతో సెక్రటేరియట్ వద్దకు చేరుకుని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడ భద్రతా విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ (SPF) పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. దంపతుల చేతిలో ఉన్న పెట్రోల్ డబ్బాను లాక్కొని వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తర్వాత దంపతులను విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారి భూమి సమస్యకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదు: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజాపాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: మంత్రి తుమ్మల

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 03 , 2026 | 12:37 PM