103 మందితో సికింద్రాబాద్ డీసీసీ
ABN , Publish Date - Apr 09 , 2026 | 10:18 AM
గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్న సికింద్రాబాద్ జిల్లాకు పార్టీ కమిటీని 103మందితో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ప్రకటించారు.
ప్రకటించిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్న సికింద్రాబాద్ జిల్లాకు పార్టీ కమిటీని 103మందితో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ప్రకటించారు. సికింద్రాబాద్ డీసీసీ కార్యవర్గంలో 12మంది ఉపాధ్యక్షులు, 26మంది ప్రధాన కార్యదర్శులు, ఒకరు కోశాధికారి, ఐదుగురు అధికార ప్రతినిధులు, 44మంది కార్యదర్శులు, 13మంది కార్యవర్గ సభ్యులు ఉండనున్నారు.
ఈ కమిటీని సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్‌జాన్ ప్రతిపాదన చేయగా టీపీసీసీ ఆమోదించింది. పూర్తిస్థాయి కమిటీని టీపీసీసీ ప్రకటించడం పట్ల డీసీసీ అధ్యక్షుడు దీపక్‌జాన్ కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ ప్రమాణ స్వీకారం త్వరలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు, క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడానికి కార్యవర్గ పనితీరు ఆధారంగా మరిన్ని మార్పులు, చేర్పులు ఉంటాయని ఆయన చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య
Read Latest Telangana News and National News