Share News

ఏబీఎన్‌ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు

ABN , Publish Date - Apr 09 , 2026 | 09:44 AM

నెల్లూరులో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి సిబ్బందిని బెదిరింపులకు గురి చేశారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేసేందుకు కాకాణి, వైసీపీ శ్రేణులు యత్నించారు.

ఏబీఎన్‌ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు
Kakani Govardhan Reddy

నెల్లూరు, ఏప్రిల్ 9: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి యత్నించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Goverdhan Reddy), మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సిబ్బందిని కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేశారు. ‘దమ్ముంటే, మగాళ్లు అయితే బారికేడ్లు దాటి రండి’ అంటూ సిబ్బందిని హెచ్చరించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణని తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు కాకాణి.


శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు, ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేసేందుకు కాకాణి, వైసీపీ శ్రేణులు తీవ్రంగా యత్నించారు. బారికేడ్లు, పోలీసులను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో పాటు ఆంధ్రజ్యోతి ప్రతులని దహనం చేసి విధ్వంసం సృష్టించారు. ఈ సంఘటనపై ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ కె.హరికృష్ణ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు పోలీసులు సెక్షన్లు 189(2), 126(2), 79, 351(2) ఆర్/డబ్ల్యూ 190 బీఎన్ఎస్ కింద కాకాణి, మరికొందరిపై కేసు నమోదు చేశారు. మీడియా స్వేచ్ఛపై జరిగిన ఈ దాడి యత్నాన్ని వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు.


ఇవి కూడా చదవండి...

హోర్ముజ్‌పై ఇరాన్ కీలక ప్రకటన.. ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని ఆదేశం..

ఏబీఎన్‌ ఎండీపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్థసారథి

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 09 , 2026 | 09:55 AM