Share News

ఏబీఎన్‌ ఎండీపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్థసారథి

ABN , Publish Date - Apr 09 , 2026 | 09:25 AM

మాజీ ముఖ్యమంత్రిగా, సాక్షి దినపత్రికకు అధిపతిగా ఉండి సంయమనం పాటించకుండా దూషణలు చేయడం సరికాదని వైఎస్ జగన్‌పై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధమన్నారు.

ఏబీఎన్‌ ఎండీపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్థసారథి
Minister Parthasarathi

ఏలూరు, ఏప్రిల్ 9: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై(ABN Andhrajyothy MD Vemuri Radhakrishna) మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కొలుసు పార్థసారథి(Minister Parthasarathi) తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రిగా, సాక్షి దినపత్రికకు అధిపతిగా ఉండి సంయమనం పాటించకుండా దూషణలు చేయడం సరికాదన్నారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధమన్నారు. పత్రికల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే చట్టపరంగా, న్యాయపరంగా పోరాడాలన్నారు. ఇలా మీడియా సంస్థలపై దాడులకు దిగి బెదిరింపులకు పాల్పడటాన్ని మంత్రి ఖండించారు.


ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు...

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేతకాని పనులను మంత్రి ఎత్తిచూపారు. రాజధాని అనేది రాజకీయ పార్టీల క్రీడ కాకూడదన్నారు. మావిగన్ అంటూ వైసీపీ అభాసుపాలవుతూ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ప్రజలపై వైసీపీ విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల భారం మోపితే.. కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ ఛార్జీలు పెట్టి తగ్గిస్తున్నామని చెప్పారు. రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని అన్నారు.


కక్ష సాధింపు కోసమే..

2028 నాటికి కూటమి ప్రభుత్వం.. పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులు, బ్రహ్మాండమైన రాజధానిని సిద్ధం చేసి, 20 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చి ఉద్యోగవకాశాలను కల్పించి విజయాలను అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ నాయకులకు న్యాయస్థానాలపై నమ్మకం లేక ఆటవిక, అరాచక వ్యవస్థను నచ్చిన విధంగా నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. మా ప్రభుత్వమే రాబోతుందంటూ అధికారులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారం కోరుకునేది ప్రజల మేలు కోసం కాదని.. కక్ష సాధింపు చర్యలకే అని మంత్రి పార్థసారథి వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

విజయవాడ టెర్రర్ లింక్స్ కేసు.. కస్టడీలోకి మరో ఆరుగురు నిందితులు

హోర్ముజ్‌పై ఇరాన్ కీలక ప్రకటన.. ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని ఆదేశం..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 09 , 2026 | 09:52 AM