Share News

విజయవాడ టెర్రర్ లింక్స్ కేసు.. కస్టడీలోకి మరో ఆరుగురు నిందితులు

ABN , Publish Date - Apr 09 , 2026 | 08:51 AM

పోలీసులు కొద్దిరోజుల క్రితం విజయవాడకు చెందిన రెహ్మతుల్లా షరీఫ్‌, డానిష్‌, సొహైల్‌ బేగ్‌.. హైదరాబాద్‌కు చెందిన సయిదా బేగం.. బళ్లారికి చెందిన అబ్దుల్‌ సలాంలను కస్టడీకి తీసుకుని విచారించారు. వారు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా మరో 6 మందిని విచారణ చేయనున్నారు.

విజయవాడ టెర్రర్ లింక్స్ కేసు.. కస్టడీలోకి మరో ఆరుగురు నిందితులు
Vijayawada terror case

విజయవాడ, ఏప్రిల్ 9: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మరో ఆరుగురిని కొత్తపేట పోలీసులు నేటి నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకురానున్నారు. పోలీసులు కొద్దిరోజుల క్రితం విజయవాడకు చెందిన రెహ్మతుల్లా షరీఫ్‌, డానిష్‌, సొహైల్‌ బేగ్‌.. హైదరాబాద్‌కు చెందిన సయిదా బేగం.. బళ్లారికి చెందిన అబ్దుల్‌ సలాంలను కస్టడీకి తీసుకుని విచారించారు.


వారు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా మరో 6 మందిని విచారణ చేయనున్నారు. సీజేఎమ్ కోర్టు నేటి నుంచి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆరుమందిని కస్టడీకి అనుమతి ఇచ్చింది. టెర్రర్ లింక్స్ కేసులో మొత్తం 13 మందిపై కేసు నమోదు కాగా.. 12 మందిని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. 12 మందిలో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కి తరలించారు.


పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్న నిందితులు

  • షాద్ మాన్ దిల్కష్, బిహార్ (A4)

  • లక్కీ అహ్మద్, ఢిల్లీ (A7)

  • జిషాన్, రాజస్థాన్ (A9)

  • మీర్ ఆసిఫ్ అలీ బంకురా, పశ్చిమ బెంగాల్(A10)

  • షేక్ ఫయాజ్ రెహమాన్, మహారాష్ట్ర (A13)

  • షారుక్భన్, పుణె (A12)


ఇవి కూడా చదవండి

విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు జేఎన్‌టీయూ నోటిఫికేషన్‌

అక్రమాస్తుల కేసు.. ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అధికారిణి శాంతి?

Updated Date - Apr 09 , 2026 | 09:06 AM