Share News

విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు జేఎన్‌టీయూ నోటిఫికేషన్‌

ABN , Publish Date - Apr 09 , 2026 | 08:49 AM

జేఎన్‌టీయూ క్యాంపస్‌ కళాశాలల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు ఫారిన్‌ రిలేషన్స్‌ విభాగం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు జేఎన్‌టీయూ నోటిఫికేషన్‌

  • విదేశీ పౌరులు, గల్ఫ్‌లో పనిచేస్తున్న భారతీయుల పిల్లల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ క్యాంపస్‌ కళాశాలల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు ఫారిన్‌ రిలేషన్స్‌ విభాగం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫారిన్‌ నేషనల్స్‌ (ఎఫ్‌ఎన్‌), ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ), చిల్డ్రన్‌ ఆఫ్‌ ఇండియన్‌ వర్కర్స్‌ ఇన్‌ గల్ఫ్‌ కంట్రీస్‌ (సీఐడబ్ల్యుజీ) కోటాలో బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీహెచ్‌డీ తదితర విభాగాల్లో మొత్తం 180 సీట్లను భర్తీ చేయనున్నారు. బీటెక్‌లో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఏఐఎంఎల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ, జియో ఇన్ఫర్మాటిక్స్‌, బీబీఏ అనలిటిక్స్‌, బీఫార్మసీ..


city4.2.jpgతదితర అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు ఏప్రిల్‌ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని ఫారిన్‌ రిలేషన్స్‌ విభాగం డైరెక్టర్‌ వసుమతి తెలిపారు. ఎంబీఏ, ఎంటెక్‌, ఎం.ఫార్మసీ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 17లోగా, పీహెచ్‌డీ ప్రవేశాలకు అక్టోబరు 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం విద్యార్థుల లేదా వారి తల్లిదండ్రులు.. జేఎన్‌టీయూ పరిపాలనా భవనం రెండో అంతస్తులోని ఫారిన్‌ రిలేషన్స్‌ విభాగాన్ని సంప్రదించాల్సింగా డైరెక్టర్‌ వసుమతి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య

Read Latest Telangana News and National News

Updated Date - Apr 09 , 2026 | 09:13 AM