ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం.. నెతన్యాహుపై స్వదేశంలో విమర్శలు..
ABN , Publish Date - Apr 09 , 2026 | 09:52 AM
ఇజ్రాయెల్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ సోషల్ మీడియా ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని, ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఆక్షేపించారు. ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రాజకీయ వైఫల్యంగా అభివర్ణించారు
యుద్ధ లక్ష్యాలను సాధించడంలో ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు విఫలమయ్యారని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇజ్రాయెల్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని, ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఆక్షేపించారు. ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రాజకీయ వైఫల్యంగా అభివర్ణించారు (Netanyahu criticism Iran ceasefire).
యుద్ధ లక్ష్యాలను సాధించడంలో నెతన్యాహు తీవ్రంగా విఫలమయ్యారని, ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ భద్రతకు ప్రమాదకరమని యైర్ లాపిడ్ పేర్కొన్నారు. 'మన చరిత్రలో ఇంతటి రాజకీయ విపత్తు ఎన్నడూ జరగలేదు. అహంకారం, నిర్లక్ష్యం, వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడం వల్ల నెతన్యాహు కలిగించిన రాజకీయ, వ్యూహాత్మక నష్టాన్ని పూడ్చడానికి మనకు సంవత్సరాలు పడుతుంది' అని ట్వీట్ చేశారు. సైన్యం తమకు అప్పగించిన పనులన్నీ పూర్తి చేసిందని, ప్రజలు కూడా అద్భుతమైన స్థైర్యాన్ని ప్రదర్శించారని, అయితే నెతన్యాహు రాజకీయంగా, వ్యూహాత్మకంగా విఫలమయ్యారని విమర్శించారు. (Israel opposition reaction).
తాను నిర్దేశించుకున్న లక్ష్యాలలో దేనినీ నెతన్యాహు సాధించలేకపోయారన్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్మూలించడం లేదా తీవ్రంగా దెబ్బతీయడాన్ని నెతన్యాహు యుద్ధానికి ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఇజ్రాయెల్‌కు అస్తిత్వ ముప్పుగా అభివర్ణించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను నిర్వీర్యం చేయాలని, ఇరాన్ పాలనను బలహీనపరచాలని, దాని మిత్ర బృందాల నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకోవాలని నెతన్యాహు లక్ష్యాలుగా పెట్టుకున్నారు (US Iran truce controversy).
నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో నెతన్యాహు దారుణంగా విఫలమయ్యారని మాజీ ప్రధాని నాఫ్తాలి బెన్నెట్ విమర్శించారు. 'నాయకత్వం మనకు భ్రమలు కల్పించింది. వారి వాగ్దానాలన్నీ ఈ రాత్రి మన మొహం మీదే పేలిపోయాయి' అని బెన్నెట్ ట్వీట్ చేశారు (Netanyahu strategy debate). ఈ ఒప్పందం రాబోయే సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ భద్రతను ప్రమాదంలో పడేసే ఒక సంపూర్ణ వైఫల్యం అని అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మళ్లీ హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..
పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..