Share News

ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి

ABN , Publish Date - Apr 09 , 2026 | 09:42 AM

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు.

ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి

  • ఆ తర్వాత అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్: ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని క్రిసెంట్‌ గేటెడ్‌ కమ్యూనిటీ వాసులతో సీనియర్‌ సిటిజన్‌ ఫోరం రమే్‌షబాబు ఆధ్వర్యంలో మీట్‌అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్‌యాదవ్‌, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణయాదవ్‌ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ.. విద్యావంతులు సమాజంలో మార్పు కోసం కృషి చేయాలన్నారు. 12 ఏళ్ల క్రితం దేశం ఆర్థికంగా 12వ స్థానంలో ఉందని, ప్రస్తుతం 4వ స్థానంలో ఉందన్నారు. 2014లో ఎకానమీ రూ.106.57 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం రూ.331.03లక్షల కోట్లని ఆయన అన్నారు.


city5.2.jpgఅభివృద్ధిలో దేశం ఎంతో ముందుందన్నారు. విద్యావంతులు ఈ విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌, కృష్ణయ్య, సూర్యతేజ, పూర్ణచందర్‌రావు, శ్రీనివాస్‌, అశోక్‌ బాల్దా, మహిపాల్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, జితేందర్‌, శివయాదవ్‌, శ్రీశైలం, రాజేశ్వర్‌రెడ్డి, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య

Read Latest Telangana News and National News

Updated Date - Apr 09 , 2026 | 09:47 AM