జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం.. రోడ్లపై ఎగిసిపడుతున్న డ్రమ్ములు
ABN , Publish Date - Apr 09 , 2026 | 08:26 AM
హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో భాపీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. దుండిగల్ సమీపంలోనూ ఓ అగ్నిప్రమాదం సంభవించింది.
హైదరాబాద్: నగర పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని రాంరెడ్డి నగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్రమంగా నిల్వ ఉంచిన సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి.
మంటల తీవ్రతతో కెమికల్ సాల్వెంట్స్ నిండిన డ్రమ్స్ రోడ్లపై ఎగిసిపడుతూ పేలిపోవడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ కారణంగా స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డెకరేషన్ సామగ్రి నిల్వ ఉంచిన గోదాములో మంటలు చెలరేగి, పక్కనే ఉన్న ఇంటికి కూడా వ్యాపించాయి. ప్లాస్టిక్ పదార్థాలు ఎక్కువగా ఉండటంతో దట్టమైన పొగ కాలనీలో వ్యాపించింది. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read:
బిల్లులు కడితేనే ఎత్తిపోతలకు విద్యుత్
కొత్త రాజకీయాలను పరిచయం చేస్తా
For More Latest News