Share News

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి? నేడు కేటీఆర్ భేటీతో కీలక పరిణామాలు

ABN , Publish Date - Apr 09 , 2026 | 07:50 AM

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నేడు కేటీఆర్ ఆయనతో భేటీ కానున్నారని తెలుస్తోంది.

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి? నేడు కేటీఆర్ భేటీతో కీలక పరిణామాలు
Jeevan Reddy BRS Entry

జగిత్యాల: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరలోనే భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో భేటీ కానున్నారని తెలుస్తోంది.


మధ్యాహ్నం పార్టీ ముఖ్య నేతలతో కలిసి జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్లనున్నారు. ఈ భేటీకి ముందు నుంచే ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. నిన్ననే కేటీఆర్ ఫోన్ ద్వారా జీవన్ రెడ్డితో మాట్లాడి పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌లో కీలక నాయకుడిగా జీవన్ రెడ్డిని తీసుకురావాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో, గతంలో సీనియర్ నేత కేకేకు ఇచ్చిన సెక్రటరీ జనరల్ పదవిని జీవన్ రెడ్డికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ఇక ఆయన పార్టీ ప్రవేశానికి సంబంధించిన తేదీపై కూడా చర్చ జరుగుతోంది. ఈ నెల 13న లేదా ఏప్రిల్ 27న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. నేడు జరగనున్న కేటీఆర్-జీవన్ రెడ్డి భేటీ అనంతరం, ఆయన పార్టీలో చేరే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Also Read:

బిల్లులు కడితేనే ఎత్తిపోతలకు విద్యుత్‌

కొత్త రాజకీయాలను పరిచయం చేస్తా

For More Latest News

Updated Date - Apr 09 , 2026 | 08:10 AM