Share News

కొత్త రాజకీయాలను పరిచయం చేస్తా

ABN , Publish Date - Apr 09 , 2026 | 07:22 AM

తాను పెట్టబోయే కొత్తపార్టీతో తెలంగాణ గడ్డకు కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

కొత్త రాజకీయాలను పరిచయం చేస్తా

  • ఈనెల 25 తెలంగాణ భవిష్యత్తును మార్చేరోజు: కవిత

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): తాను పెట్టబోయే కొత్తపార్టీతో తెలంగాణ గడ్డకు కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ప్రశ్నించటం, పోరాడటమే తమపంథా అని పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్‌ కుమార్‌ బుధవారం తన అనుచరులతో జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఈనెల 25వ తేదీ రాష్ట్ర భవిష్యత్‌ను, చరిత్రను మార్చే రోజుగా నిలుస్తుందన్నారు. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సలు ప్రజా సమస్యలు పట్టించుకోవటం లేదన్నారు.సింహం గుర్తుతో పోటీచేస్తే జాగృతికి మొదటి విజయాన్ని ఇచ్చింది గద్వాల్‌ జిల్లానేనని కవిత గుర్తు చేశారు. జాగృతిలో చేరిన రంజిత్‌కుమార్‌ మాట్లాడుతూ.. కవిత లోని ఽధైర్యాన్ని చూసి జాగృతిలో చేరానన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 07:22 AM