మావోయిస్టుల లొంగుబాటు పాలసీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక హామీ
ABN , Publish Date - Feb 27 , 2026 | 07:07 PM
మావోయిస్టుల అగ్రనేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో మావోయిస్టుల లొంగుబాటు పాలసీపై సీఎం చర్చించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల అగ్రనేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ(శుక్రవారం) సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో మావోయిస్టుల లొంగుబాటు పాలసీపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరిని పలకరించారాయన. మావోయిస్టుల పునరావాసంపై హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావో నేతలపై ఉన్న రివార్డును వెంటనే అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతిస్తే జైల్లో ఉన్న మావోయిస్టులను కలుస్తామని మావోయిస్టు నేతలు పేర్కొన్నారు.
అలాగే , లొంగిపోయిన మావోయిస్టుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లొంగిపోవటానికి చొరవ చూపిన ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌కి మావోయిస్ట్ నేతలు ధన్యవాదాలు తెలిపారు. చట్టప్రకారం పునరావాసం, రక్షణ పరమైన సహకారం తమ ప్రభుత్వం అందిస్తుందని భరోసా కల్పించారు. మావోయిస్టుల లొంగుబాటుపై తెలంగాణ అసెంబ్లీలో ప్రకటన చేస్తానని తెలిపారు. మావోయిస్టులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు బాగున్నాయని మావోయిస్టులు అన్నారు. ఈ ప్రభుత్వ లొంగుబాటు పాలసీ బాగుందని సీఎంకు మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ తెలిపారు. తమ భవిష్యత్ ప్రణాళికలపై సీఎం రేవంత్‌రెడ్డికి మావోయిస్టు అగ్రనాయకులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ విద్యా రంగంలో సంస్కరణలు.. కీలక సిఫార్సులు చేసిన కమిషన్
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And Telugu News