తెలంగాణ విద్యా రంగంలో సంస్కరణలు.. కీలక సిఫార్సులు చేసిన కమిషన్
ABN , Publish Date - Feb 26 , 2026 | 09:45 PM
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ విద్యామండలి కమిషన్ నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కమిషన్ పలు కీలక సూచనలు చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (Cm Revanth Reddy) తెలంగాణ విద్యామండలి కమిషన్ నివేదిక (Telangana Education Commission Report) అందజేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. సెర్చ్ కమిటీ ద్వారా వీసీల నియామకం చేయాలని తెలిపింది. ఉపాధ్యాయులకు ఇక ఆటోమేటిక్ ప్రమోషన్లు లేవని.. పనితీరు ఆధారంగా మాత్రమే పదోన్నతులు కల్పించాలని స్పష్టం చేసింది.
ప్రతి ఐదేళ్లకు టీచర్ల పనితీరు అంచనా వేయాలని, మెరుగుపడకపోతే సర్వీసు నుంచి తొలగించాలని సూచించింది. నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి సిఫార్సు చేయాలని తెలిపింది. ఒకటో తరగతి నుంచే త్రిభాషా విధానంలో భాగంగా తెలుగు/ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ బోధన ఉండాలని చెప్పింది. D.El.Ed రద్దు చేస్తూ.. బీఎడ్‌ను ప్రైమరీ, సెకండరీగా విభజన ప్రతిపాదించాలని పేర్కొంది.
EAPCET రద్దు సిఫార్సు చేస్తూ.. ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజినీరింగ్, అగ్రి, ఫార్మసీ అడ్మిషన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. IIT-JEE, NEET కోచింగ్ సెంటర్లపై కఠిన నియంత్రణ ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. ఫీజులు, మానసిక ఆరోగ్యంపై పర్యవేక్షించాలని సూచించింది. పదో తరగతి, ఇంటర్ బోర్డుల విలీనం చేస్తూ కనిష్ట ఉత్తీర్ణత శాతం 45శాతానికి పెంచాలని తెలంగాణ విద్యా మండలి కమిషన్ సూచనలు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది: ఫైర్ ఆఫీసర్ రాందాస్
ఖర్గేని కలిసిన జగ్గారెడ్డి.. అసలు విషయమిదే..
Read Latest Telangana News And AP News And Telugu News