Share News

జీఎస్ఎల్వీ-ఎఫ్18 ప్రయోగం విజయవంతం.. ఇస్రోకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:02 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన జీఎస్ఎల్వీ- ఎఫ్18 రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తి కావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

జీఎస్ఎల్వీ-ఎఫ్18 ప్రయోగం విజయవంతం.. ఇస్రోకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
cm revanth reddy congratulates isro

హైదరాబాద్, అక్టోబర్ 31: శుక్రవారం అర్ధరాత్రి 11.51 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని షార్ (శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్) నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా అత్యాధునిక నావిగేషన్ ఉపగ్రహం ఎన్‌విఎస్-03 ని నింగిలోకి పంపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్రోను ప్రశంసిస్తూ.. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బందికి అభినందనలు తెలిపారు.


అత్యాధునిక నావిగేషన్ ఉపగ్రహం ఎన్‌విఎస్-03 ద్వారా భారత నావిగేషన్ సామర్థ్యాలకు మరింత బలం చేకూరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. రవాణా, విమానయానం, సముద్ర నావిగేషన్ రంగాలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. పర్యవేక్షణ, అత్యవసర సేవల్లోనూ కీలకంగా మారనుందని తెలిపారు. ఇస్రో విజయం యావత్ దేశానికి గర్వకారణమన్న సీఎం.. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభాయ్ పటేల్ దార్శనికత యావత్ జాతికి స్ఫూర్తిదాయకం: సీఎం చంద్రబాబు

వెండి ధరలో భారీ పతనం.. ఒక్కరోజే రూ.10 వేల తగ్గుదల

For More TG News and Telugu News

Updated Date - Oct 31 , 2026 | 01:12 PM