Share News

వల్లభాయ్ పటేల్ దార్శనికత యావత్ జాతికి స్ఫూర్తిదాయకం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:08 AM

భారతదేశ తొలి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు.

వల్లభాయ్ పటేల్ దార్శనికత యావత్ జాతికి స్ఫూర్తిదాయకం: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu

అమరావతి, అక్టోబర్ 31: భారతదేశ తొలి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. శనివారం తన ఎక్స్ ఖాతా వేదికగా ఆయనకు సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. ‘భారతదేశాన్ని ఏకం చేసి, అఖండ భారత నిర్మాణానికి పునాదులు వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను’.


‘దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాలను పరిరక్షించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన అసమాన కృషికి గుర్తుగా, ఆయన ఆశయాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో ప్రతి ఏటా అక్టోబర్ 31న 'రాష్ట్రీయ ఏక్తా దివస్' జరుపుకుంటున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత, ఉక్కు సంకల్పం యావత్ జాతికి సదా స్ఫూర్తిదాయకం. దేశ ఐక్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి పవిత్ర బాధ్యత, సంకల్పం కావాలి’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


దేశ సమగ్రతకు విశేషంగా కృషి చేసిన వల్లభాయ్ పటేల్: మంత్రి లోకేశ్

భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్‌ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను వివరించారు. శనివారం తన ఎక్స్ ఖాతా వేదికగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘స్వాతంత్ర్య సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను’.


‘ఆయన దార్శనికత, అచంచల దేశభక్తి నేటితరానికి స్ఫూర్తిదాయకం. దేశ సమగ్రత, ఐక్యత కోసం విశేషంగా కృషిచేశారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు అందరం పునరంకితమవుదాం’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వెండి ధరలో భారీ పతనం.. ఒక్కరోజే రూ.10 వేల తగ్గుదల

మొయినాబాద్‌లో విషాదం.. విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి

For More AP News and Telugu News

Updated Date - Oct 31 , 2026 | 11:46 AM