Share News

మొయినాబాద్‌లో విషాదం.. విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి

ABN , Publish Date - Oct 31 , 2026 | 08:36 AM

పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో చోటు చేసుకుంది.

మొయినాబాద్‌లో విషాదం.. విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి

హైదరాబాద్, అక్టోబర్ 31: పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి స్థానిక కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఫెస్టివల్ జరిగింది. ఈ ఫెస్టివల్ అనంతరం పలువురు విద్యార్థులు కాలేజీ సమీపంలోని పొలాల్లోకి వెళ్లి మద్యం తాగుతున్నారు. అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం అటు వైపు వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన ఆ విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో రైతు రాజిరెడ్డి పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి మోహన్‌తోపాటు మరో విద్యార్థి మృతి చెందారు.


వెంటనే ఈ విషయాన్ని కాలేజీ అధికారుల దృష్టికి సహచర విద్యార్థులు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు గుర్తించారు. ఆ మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలువురు విద్యార్థుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వారు సేకరిస్తున్నారు. విద్యార్థులు మృతిపై వారి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గడువు ముగిసిన మందులు వాడితే ఏమవుతుంది..?

బలపడుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

For More TG News and Telugu News

Updated Date - Oct 31 , 2026 | 10:54 AM