Share News

గడువు ముగిసిన మందులు వాడితే ఏమవుతుంది..?

ABN , Publish Date - Oct 31 , 2026 | 07:47 AM

మెడికల్ షాపునకు పదే పదే తిరగలేమని చాలా మంది కొన్ని నెలలకు సరిపడా మందులు ముందే కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ఆ మందులకు డేట్ ఉందా?.. ఎక్స్‌పైర్ అయిందా? అనే విషయాన్ని అంతగా పట్టించుకోరు.

గడువు ముగిసిన మందులు వాడితే ఏమవుతుంది..?

ఇంటర్నెట్ డెస్క్: మెడికల్ షాపునకు పదే పదే తిరగలేమని చాలా మంది కొన్ని నెలలకు సరిపడా మందులు ముందే కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ఆ మందులకు డేట్ ఉందా?.. ఎక్స్‌పైర్ అయిందా? అనే విషయాన్ని అంతగా పట్టించుకోరు. ఏదైనా అనారోగ్యానికి గురైతే ఆ ముందు వేసుకుంటారు. అప్పటికి వాటికి డేట్ ఉంటే సరే. కానీ డేట్ ఎక్స్‌పైరీ అయితే మాత్రం ఆందోళన చెందుతారు. డేట్ ఎక్స్‌పైరీ మందులు వేసుకోవడం వల్ల అనారోగ్యానికి గురవుతామేమోనని తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఇది మరో కొత్త అనారోగ్య సమస్యకు దారి తీస్తుంది.


గడువు ముగిసిన మందులు వాడడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలా వాడడం వల్ల అనర్థాలు జరుగుతాయని వివరిస్తున్నారు.

  • చర్మంపై అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి.

  • చిన్న మెటిమలు రావచ్చు.

  • దద్దుర్లు రావచ్చు.

  • చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి.

  • ఆయాసం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

  • ఎవరికైనా శ్వాస తీసుకోవడంలో సమస్య, గుండె జబ్బులు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉంటే.. మందులు కొనుగోలు, వాటిని వినియోగించే ముందు తేదీలను తప్పని సరిగా పరిశీలించాలి.


గడువు ముగిసిన మందులు వాడితే.. పరిస్థితి ఏమిటి?

ఓ వేళ పొరపాటున ఎక్స్‌పైరీ టాబ్లెట్, సిరప్ లేదా క్యాప్సుల్ ఏదైనా తీసుకుంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. తద్వారా జరగబోయే ప్రమాదాన్ని ముందే నివారించవచ్చు.

గడువు ముగిసిన మందులు వాడడం వల్ల అనర్థాలు జరిగితే తాము బాధ్యులమని ఏ మందుల తయారీ సంస్థ హామీ ఇవ్వద్దు. ఈ నేపథ్యంలో మందులు కొనుగోలు, వినియోగం సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వైద్యులు స్పష్టం చేస్తున్నారు.


ఇవీ కూడా చదవండి..

శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలా?.. ఇవిగో 8 సూత్రాలు

లిఫ్ట్‌లో చిక్కుకుపోయారా..? బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకోండి

For More LifeStyle News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 07:59 AM